Rajasthan High Court
Rajasthan High Court: ఓ మహిళ హైకోర్టును విచిత్రమైన కోరిక కోరింది. నేను తల్లిని కావాలని అనుకుంటున్నానని, తనకు ఆ అవకాశం కల్పించాలని రాజస్థాన్ హైకోర్టును మహిళ ఆశ్రయించింది. కోర్టుసైతం అందుకు అంగీకరించింది. ఇందుకు సంబంధించిన వివరాలు పరిశీలిస్తే.. రాజస్థాన్‌కు చెందిన రాహుల్ అనే వ్యక్తి అల్వార్ సెంట్రల్ జైలులో జీవిత ఖైదును అనుభవిస్తున్నాడు. అతనికి 25 సంవత్సరాలు. రాహుల్ గతంలో మైనర్ బాలికను అపహరించి అత్యాచారం చేసిన కేసులో పలు సెక్షన్లు, పోక్సో చట్టం కింద కోర్టు దోషిగా నిర్ధారించింది. దీంతో.. 20ఏళ్లు జైలు శిక్ష విధించింది. రెండేళ్ల క్రితం రాహుల్ జైలుకొచ్చాడు.
Rajasthan : పెళ్లైన 54 ఏళ్లకు తల్లితండ్రులైన వృధ్ధ దంపతులు
రాహుల్ జైలు శిక్షకంటే ముందే వివాహం అయింది. తాజాగా ఆమె రాజస్థాన్ కోర్టుకు పెరోల్ పిటీషన్‌ను సమర్పించింది. ఈ పిటీషన్‌ను స్వీకరించిన కోర్టు దీనిపై విచారించింది. ఈ కేసును జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ సమీర్ జైనల్‌లతో కూడిన డివిజన్ బెంచ్ విచారిచింది. పిటీషన్‌దారు.. తనకు తల్లిని కావాలని ఉందని, వంశ వృద్ధికోసం తన భర్తతో పిల్లలు కనేందుకు అనుమతి ఇవ్వాలని, అందుకోసం తన భర్తను పెరోల్‌పై విడుదల చేయాలని కోర్టును కోరింది.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.
పిటీషన్‌పై విచారణ సమయంలో.. మహిళ తన వంశ పరిరక్షణ కోసమే పిటీషన్ దాఖలు చేసిందని, పిటీషన్‌ను తిరస్కరిస్తే హక్కులను కాలరాసినట్లే అవుతుందన్న కోర్టు దోషికి 15రోజులు పెరోలు మంజూరు చేస్తున్నట్లు పేర్కొంది. రూ.2లక్షల వ్యక్తిగత పూచీకత్తుతో పాటు లక్ష రూపాయల చొప్పున రెండు జామీను బాండ్లు సమర్పించాలని పెరోలు పొందవచ్చని సూచించింది. అయితే రాజస్థాన్ హైకోర్టు గతంలోనూ ఇలాంటి తీర్పునిచ్చింది. రాజస్థాన్ హైకోర్టు జోధ్‌పూర్ బెంచ్ ఒక ఖైదీకి పదిహేను రోజుల పెరోల్‌ను ఆమోదించింది. సంతానం లేదనే కారణంతో ఖైదీ భార్య పిటీషన్ దాఖలు చేయగా, భర్త నుంచి పిల్లలను కలిగేలా కోర్టు పదిహేను రోజులు పెరోల్ పై ఖైదీని విడుదల చేసింది.