మన టాలెంట్ నిరూపించుకోవటానికి టెక్నాలజీ వేదికగా మారింది. ఒకప్పుడు మనలో ఉన్న ప్రతిభను నిరూపించుకోవటానికి ఎన్నో కష్టాలు పడాల్సి వచ్చేది. కాని ఇప్పుడు ట్రెండ్ మారింది. టాలెంట ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా టెక్నాలజీ బైటపెట్టేస్తోంది. ఈ టెక్నాలజీతో ఎటువంటి గుర్తింపు లేనివారిని కూడా రాత్రికి రాత్రే ఓవర్‌నైట్ సెలబ్రిటీల్ని చేసేస్తోంది. అలా ఓవర్ నైట్ స్టార్స్ కావాలంటే టాలెంట్ ఉంటే సరిపోతుంది. అదిగో అటువంటి వెల్ టాలెంట్ యూత్ చేసిన డ్యాన్ లకు నెటిజన్లు ఫిదా అయిపోయారు.
ఏం చేశార్రా బాబూ..ఇది డ్సాన్సా లేక మ్యాజిక్కా? అని ఆశ్చర్యపోతున్నారు. మీ టాలెంట్ అదరహో..అంటూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.నలుగురు యువకులు తమ డ్యాన్స్ తో సోషల్ మీడియాను షేక్ చేసేస్తున్నారు. ముక్కాబులా అనే సాంగ్‌కి దిమ్మతిరిగే స్టెప్పులు వేసి అద్దరగొట్టేశారు. స్టెప్స్ అర్ధం కాక పదే పదే ఆ వీడియోని చూసి థ్రిల్‌కి గురవుతున్నారు నెటిజన్స్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాని షేక్ చేసేస్తోంది.
బాలీవుడ్ యాక్టర్ శృతి సేత్, టీవీ పర్సనాలిటీ గౌరవ్ కపూర్ ఆ గ్యాంగ్ వేసిన స్టెప్పులకి ఫిదా అయ్యారు. 3.9 లక్షలకి పైగా నెటిజన్స్ ఇప్పటి వరకు ఈ వీడియోని చూడగా, 16000కి పైగా లైక్ చేశారు. 4700 మంది రీ ట్వీట్ చేశారు .వీళ్లు ఎవరు? ఎక్కడ చేశారు?అనే విషయం మరచిపోయే మీరు వైరల్‌గా మారిన ఈ వీడియోపై ఓ లుక్కేయండి. మీరు కూడా గ్యారంటీగా థ్రిల్ అవుతారు.