Amit Shah
My high pitched voice is manufacturing defect says Amit Shah : పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్న క్రమంలో సోమవారం (ఏప్రిల్ 4,2022) లోక్ సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా నవ్వులు పూయించారు. అమిత్ షాకు కోపం ఎక్కువ అంటూ ప్రతిపక్ష సభ్యులు అన్న మాటలకు షా సమాధానమిస్తూ..‘నాకు అస్సలు కోపమే రాదు..కానీ నా వాయిస్ మాత్రం హై పిచ్ లో (గట్టిగా మాట్లాడినట్టు)ఉంటుంది..అది మాన్యుఫాక్చరింగ్ డిఫెక్ట్ అయి ఉండవచ్చు’ అన్నారు. షా మాటలకు సభలో నవ్వులు విరబూశాయి.
నా మాట తీరే అంత దాన్ని కోపం అని అనుకోవద్దని కోరారు. నేను ఎవరినీ పరుషంగా కూడా మాట్లాడను అని తెలిపారు. నా గొంతు హైపిచ్ లో ఉండటానికి కారణం… మాన్యుఫాక్చరింగ్ డిఫెక్ట్ అని చమత్కరించారు. షా మాటలకు సభలో నవ్వులు విరబూశాయి.
నాకు అస్సలు కోపమే రాదని… అయితే కశ్మీర్ కు సంబంధించిన ప్రశ్నలు అడితే మాత్రం కోపం వస్తుందని అమిత్ షా అన్నారు. క్రిమినల్ ప్రొసీజర్ బిల్ 2022ని సభలో మూవ్ చేస్తున్న సందర్భంగా షా ఈ వ్యాఖ్యలు చేశారు. అమిత్ షాకు కోపం ఎక్కువని విపక్ష నేతలు చేసిన కామెంట్ కు సమాధానంగా ఆయన ఈ ఫన్నీ ఫన్నీ వ్యాఖ్యలు చేశారు. నేర విచారణ మరింత సమర్థవంతంగా జరగాలనే లక్ష్యంతో ఈ బిల్లును ప్రవేశ పెడుతున్నామని తెలిపారు.
నేరాల దర్యాప్తును మరింత సమర్థంగా, త్వరితగతిన చేయడమే లక్ష్యంగా ఈ బిల్లును రూపొందించినట్లు తెలిపారు.ఈ బిల్లు చాలా ఆలస్యమైందని..1980లో, లా కమిషన్ తన నివేదికలో ఖైదీల గుర్తింపు చట్టం 1920ని పునఃపరిశీలించాలని భారత ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది. అని పదే పదే చర్చ జరిగింది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ బిల్లుపై రాష్ట్రాలతో చర్చించారు. కరెస్పాండెన్స్ కూడా చేశారు. ప్రపంచవ్యాప్తంగా నేరారోపణలకు సంబంధించిన అనేక నిబంధనలను అధ్యయనం చేసిన తర్వాత ఈ బిల్లును తీసుకొచ్చారు. దీనిపై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేశారని తెలిపారు. వ్యక్తి స్వేచ్ఛపై కూడా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఆ ప్రజలందరి ఆందోళనలను బిల్లులో పొందుపరిచారు.