President Kovind: రాష్ట్రపతి జీతమెంతో తెలుసా? సగానికి పైగా పన్నులు రూపంలోనే!

రాష్ట్రపతి రైలులో సొంతూరికి వెళ్లారు. దేశ అధ్యక్షుడిగా పదవిలోకి అడుగుపెట్టిన తర్వాత రామ్‌నాథ్ కోవింద్.. రాష్ట్రపతి హోదాలో తన జీతం, కట్టింగ్‌ల గురించి మాట్లాడడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది.

President Ram Nath Kovind Salary: రాష్ట్రపతి రైలులో సొంతూరికి వెళ్లారు. దేశ అధ్యక్షుడిగా పదవిలోకి అడుగుపెట్టిన తర్వాత రామ్‌నాథ్ కోవింద్.. రాష్ట్రపతి హోదాలో తన జీతం, కట్టింగ్‌ల గురించి మాట్లాడడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. ఫైనాన్స్ యాక్ట్ 2018లోని సెక్షన్ 137 కింద చేసిన సవరణ తరువాత, భారత రాష్ట్రపతి నెలసరి జీతం జనవరి 1, 2016 నుండి రూ.5 లక్షలకు నిర్ణయించబడింది. అదే సమయంలో రాష్ట్రాల గవర్నర్‌కు ప్రతి నెలా రూ.3,50,000ను వేతనంగా ప్రభుత్వం అందిస్తుంది.

రాష్ట్రపతి తన భార్యతో కలిసి మొదటిసారి రైలులో కాన్పూర్ వెళ్లగా ఈ సమయంలో రాష్ట్రపతికి జీతానికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ మాట్లాడుతూ.. దేశంలోనే అత్యధిక జీతం తీసుకనే వ్యక్తిని నేను.. నా నెల సంపాదన రూ.5లక్షలు. కానీ, అందులో 3 లక్షల దాకా ట్యాక్స్‌, కట్టింగ్‌ల రూపంలో పోతూనే ఉన్నాయి. ఆ లెక్కన నాకు మిగిలేది తక్కువే. అంటే మిగిలినవాళ్ల కంటే నేనేం బెటర్‌ కాదు. ఒక టీచర్‌ నాకంటే ఎక్కువే సేవింగ్స్‌ చేస్తున్నాడు’’ అంటూ సరదాగా నవ్వుతూ ఓ సభలో మాట్లాడారు.

ఈ వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాష్ట్రపతి జీతంలో ట్యాక్స్‌ కట్టింగ్‌లు ఉండవంటూ కొందరు వాదిస్తుంటే, మరికొందరేమో రాజ్యాంగంలోని ప్రతులంటూ కొన్ని ఆధారాలను ట్విటర్‌లో పోస్ట్‌ చేస్తున్నారు. పెన్షన్‌ యాక్ట్‌ 1951 ప్రకారం.. రాష్ట్రపతి జీతంపై పన్ను విధించరని చెప్తున్నారు. అయితే అదంతా ఉత్తదేనని, రాష్ట్రపతి జీతంలో కట్టింగ్‌లు ఉంటాయని మరికొందరు వాదిస్తున్నారు. గతేడాది కరోనా టైంలో జీతాల్లో 30శాతం వరకు త్యాగం చేసినవాళ్లలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి కూడా ఉన్నారు.

ట్రెండింగ్ వార్తలు