సుష్మా అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం: వైమానిక దాడులపై వివరణ

  • Publish Date - February 26, 2019 / 10:15 AM IST

ఢిల్లీ : మంగళవారం సాయంత్రం 5 గంటలకు  విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ అధ్యక్షతన అఖిల పక్ష సమావేశం జరగనుంది.  విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపారు. సుష్మా స్వరాజ్  ఈ సమావేశంలో  మంగళవారం తెల్లవారు ఝూమున  ఉగ్రవాదుల స్ధావరాలే లక్ష్యంగా జరిపిన వైమానిక దాడుల గురించి అఖిల పక్షానికి వివరించనున్నారు.
Also Read :1971 తర్వాత ఇదే : పాక్ లోకి వెళ్లి మరీ.. భారత్ దాడి చేసింది

ఈ రోజు ఉదయం   మోడీ  అధ్యక్షతన జరిగిన ఉన్నత స్ధాయి సమావేశం పరిస్ధితిని సమీక్షించింది.  అనంతరం మోడీ , రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతులను కలిసి   వైమానిక దాడుల వివరాలను తెలిపారు. పుల్వామా దాడి తర్వాత పాకిస్తాన్ కు తగిన బుద్ది చెపుతామని మోడీ దేశ ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చారని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ అన్నారు.  పాకిస్తాన్ ఎప్పుడైనా  దాడికి దిగే అవకాశం ఉడటంతో  సరిహద్దులో హై ఎలర్ట్ ప్రకటించారు.
Also Read : మెరుపుదాడులపై బాలీవుడ్ స్పందన ఏంటంటే?

ట్రెండింగ్ వార్తలు