Iaf C130 J Air Craft
Afghanistan Crisis : ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ నుండి 85 మంది భారతీయులతో కూడిన ఇండియన్ఎయిర్ ఫోర్స్ కు చెందిన (IAF)C-130 J విమానం ఒకటి భారత్ బయలుదేరింది. విమానం ఇంధనం నింపుకోటానికి తజికిస్తాన్ లో ల్యాండ్ అయినట్లు వార్తాసంస్ధలు ప్రకటించాయి. ఆఫ్ఘనిస్తాన్ లోని భారత పౌరుల తరలింపులో అక్కడ ఉన్న భారతీయ అధికారులు సహాయం అందిస్తున్నారని నేవీ అధికారులు తెలిపారు.
ఆఫ్ఘాన్ లో చిక్కుకుపోయిన భారత పౌరులను సురక్షితంగా భారత్ తీసుకురావటానికి అధికారులు సమన్వయంతోపని చేస్తున్నారు.ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల వశమైనప్పుడు కందహార్ నుండి భారత రాయబార కార్యాలయానికి చెందిన సిబ్బందిని కూడా తీసుకువచ్చారు. కాందహార్ కాన్సులేట్ నుంచి వచ్చిన సిబ్బందికాబూల్ కార్యాలయానికి చేరుకున్నారు. వారు అక్కడి నుంచి తమ కార్యకలాపాలు పర్యవేస్తున్నట్లు,,, సంబంధిత అధికారులు తెలిపారు.
ఈవారం ప్రారంభంలో రాజధాని కాబూల్ ని తాలిబన్లు స్వాధీనం చేసుకున్న తర్వాత భారత వాయుసేనకు చెందిన సీ-17 విమానాలు రెండు ముఖ్యమైన పనులను చేశాయి. అక్కడ విమానాశ్రయంలో యూఎస్ దళాల అనుమతి పొంది 180 మంది అధికారులు , ITBF సిబ్బంది, కొంతమంది జర్నలిస్టులను భారత్ తీసుకువచ్చింది. ఆగస్టు 15న తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ ను స్వాధీనం చేసుకున్న తర్వాత ప్రజల్లో భయాందోళనలు ఎక్కువయ్యాయి. గతంలో జరిగిన క్రూకమైన తాలిబన్ల పాలనను గుర్తుకు తెచ్చుకుని వణికిపోతున్నారు.దేశం విడిచి పారిపోవటానికి లక్షలాది మందికాబూల్ విమానాశ్రయానికి చేరుకున్నారు.