BrahMos missile: సుఖోయ్ విమానం నుంచి బ్రహ్మోస్ పరీక్ష.. విజయవంతం

సుఖోయ్ యుద్ధ విమానం నుంచి జరిపిన బ్రహ్మోస్ క్షిపణి పరీక్ష విజయవంతమైంది. ఇండియన్ నేవీతో కలిసి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మంగళవారం బంగాళాఖాతంలోని తూర్పుతీర ప్రాంతంలో ఈ పరీక్ష జరిపింది.

BrahMos missile: భారత వాయుసేన మరింత బలోపేతం కానుంది. సుఖోయ్ యుద్ధ విమానం నుంచి జరిపిన బ్రహ్మోస్ క్షిపణి పరీక్ష విజయవంతమైంది. ఇండియన్ నేవీతో కలిసి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మంగళవారం బంగాళాఖాతంలోని తూర్పుతీర ప్రాంతంలో ఈ పరీక్ష జరిపింది. ఇండియన్ నేవీకి చెందిన షిప్పు నుంచి సుఖోయ్ (ఎస్‌యూ30-ఎమ్‌కేఎల్) విమానం ద్వారా బ్రహ్మోస్ క్షిపణిని ప్రయోగించారు.

Indian Army : ఇండియన్ ఆర్మీ వెస్టర్న్ కమాండ్ లో పోస్టుల భర్తీ

నిర్దేశిత లక్ష్యాన్ని బ్రహ్మోస్ క్షిపణి కచ్చితత్వంతో చేధించిందని ఇండియన్ నేవీ ప్రకటించింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌ (ఐఏఎఫ్)కు సంబంధించిన విమానాల నుంచి బ్రహ్మోస్ క్షిపణులతో నేల మీద ఉన్నటార్గెట్‌తోపాటు, సముద్రంలోని లక్ష్యాలను కూడా చేధించవచ్చు. బ్రహ్మోస్ క్షిపణుల ద్వారా ఐఏఎఫ్ మరింత బలోపేతం అవుతుంది. ఈనెల 11న యాంటీ-ట్యాంక్ గైడెడ్ మిస్సైల్స్‌ను కూడా భారత సైన్యం విజయవంతంగా పరీక్షించింది. ఇవి దేశీయంగా అభివృద్ధి చేసిన మిస్సైల్స్. రాజస్తాన్‌లోని పోఖ్రాన్‌లో ఈ పరీక్ష జరిగింది.

ట్రెండింగ్ వార్తలు