ఈ పరీక్షలు పాసైతేనే : అభినందన్‌ను ఏం చేస్తారు

  • Publish Date - March 2, 2019 / 01:56 AM IST

ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్థమాన్‌ను ఇప్పుడు ఏం చేస్తారు?ఆయన ఎలాంటి పరీక్షలు ఎదుర్కోవాలి? పాకిస్థాన్‌కు పట్టుబడిన పైలెట్‌ భారత వాయుసేనలో మళ్లీ క్రియాశీలం అవుతారా? లేదా? ఆయనకు సైన్యం మళ్లీ కీలక బాధ్యతలు అప్పగిస్తుందా? ఇలాంటి సందేహాలు అందరిలోనూ ఉన్నాయి. IAF వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్థమాన్‌ భారత్‌కు తిరిగొచ్చాడు. సుమారు 56 గంటల తర్వాత మళ్లీ మాతృభూమి గడ్డపై అడుగుపెట్టాడు. వాఘా బోర్డర్‌లో అతడికి భారతీయులు సగర్వంగా స్వాగతం పలికారు. భారత సైన్యం అతడిని స్వదేశానికి తీసుకొచ్చింది.
Read Also : మళ్లీ తెగబడిన పాక్ రేంజర్లు : ముగ్గురు భారతీయులు మృతి

అభినందన్‌ వర్థమాన్‌కు వాయుసేనలోమళ్లీ బాధ్యతలు అప్పగించాలంటే ఆయనికి కొన్ని పరీక్షలు తప్పవు. అవి శారీరకమైన, మానసికమైన, మెడికల్‌ టెస్ట్‌లు నిర్వహించనున్నారు. అభినందన్‌ను ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్ ఇంటెలిజెన్స్ విభాగం తమ ఆధీనంలోకి తీసుకుంది. అభినందన్‌కు వాయుసేన ఇంటెలిజెన్స్‌ విభాగం పలు మెడికల్‌ టెస్ట్‌లు నిర్వహించనుంది. అతడి ఫిట్‌నెస్‌కు సంబంధించిన మరికొన్ని పరీక్షలు కూడా చేపడతారు. పాక్‌ ఆధీనంలో ఉన్నప్పుడు అభినందన్‌కు ఏమైనా బగ్‌లు, రహస్య చిప్‌లు ఏర్పాటు చేసిందా అన్న దానిపై దృష్టి పెడతారు.

ఇందుకోసం అభినందన్‌ శరీరాన్ని మొత్తంగా స్కాన్‌ చేస్తారు. అభినందన్‌కు మెడికల్‌ టెస్టులతోపాటు సైకలాజికల్‌  టెస్టులు కూడా నిర్వహిస్తారు. శత్రువుల చేతికి చిక్కిన వ్యక్తి కావడం, విపత్కర పరిస్థితులను ఎదుర్కొన్ని ఉండడంతో అతడిని హింసించారా అనే కోణంలో చెక్‌ చేస్తారు. భారత్‌కు సంబంధించిన సీక్రెట్లను ఏవైనా అడిగారా… ఒకవేళ అడిగితే అభినందన్‌ రహస్య వివరాలు ఏమైనా వెల్లడించారా అనే కోణంలోనూ విచారణ జరుపుతారు. అభినందన్‌ మానసిక పరిస్థితి, ఆలోచనా విధానం ఏవిధంగా ఉందో పరీక్షిస్తారు. అవసరమైతే ఇంటెలిజెన్స్‌ బ్యూరో, రీసెర్చ్ అనాలసిస్‌ విభాగం కూడా అభినందన్‌ వర్థమాన్‌ను ప్రశ్నించే అవకాశముంది. 
Read Also : రైతులు కావలెను : జీతం 20 వేలు

కార్గిల్‌ యుద్ధ సమయంలో పాక్‌ చేతికి చిక్కిన పైలెట్‌ కుంభంపాటి నచికేత విషయంలో ఎలాంటి పద్ధతులను అవలంభించారో ఇప్పుడు కూదా అలాంటి పద్ధతులనే అవలంభిస్తారని సైన్యాధికారులు చెబుతున్నారు. ఇలా అభినందన్‌కు అన్ని పరీక్షలు నిర్వహించి.. అందులో ఆయన సక్సెస్‌ అని తేలితేనే మళ్లీ బాధ్యతలు అప్పగిస్తారు. ఈ టెస్టుల్లో ఎక్కడైనా తేడా వచ్చినా ఏం చేయాలనేదానిపై నిర్ణయం తీసుకుంటారు. 
Read Also : ఉగ్రవాదులపై ఫోకస్ : జమాతే ఇస్లామీ సంస్థ బ్యాన్