IDBI Bank Recruitment 2021 : 650 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

బ్యాంకు ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

IDBI Bank Recruitment 2021 : బ్యాంకు ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఐడీబీఐ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 650 అసిస్టెంట్ మేనేజర్(గ్రేడ్-ఏ) పోస్టులను భర్తీ చేసేందుకు ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. అర్హులైన, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు పూర్తి చేయాల్సి ఉంటుంది. 60శాతం మార్కులతో డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. వయసు 21- 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఆన్ లైన్ లో ఆగస్టు 22లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఉత్తర, తూర్పు, పశ్చిమ, దక్షిణ మండలాల పరిధిలో మొత్తం 650 ఖాళీలను భర్తీ చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విజయవాడ, విశాఖలో పరీక్షా కేంద్రాలు ఉన్నాయి.

ఐడీబీఐ గ్రేడ్‌-A రిక్రూట్‌మెంట్‌ ఏడాది పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌ ద్వారా క్యాంపస్‌లో 9 నెలల పాటు స్టడీస్‌, ఐడీబీఐ బ్యాంకు బ్రాంచ్‌లలో 3 నెలల పాటు ఇంటర్న్‌ షిప్‌ ఉంటుంది. కోర్సు పూర్తి చేసిన వారిని అసిస్టెంట్‌ మేనేజర్‌గా నియమించనున్నారు.

ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: ఆగస్టు 10 2021
దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 22 2021
అడ్మిట్ కార్డ్ తేదీ – ఆగస్టు 27, 2021
ఆన్‌లైన్ పరీక్ష తేదీ సెప్టెంబర్ 4, 2021

జీతం..
స్టైపెండ్ (శిక్షణ సమయంలో): శిక్షణ కాలంలో (9 నెలలు) – నెలకు `2,500/. అలాగే ఇంటర్న్‌షిప్ వ్యవధిలో (3 నెలలు) -` 10,000/ – నెలకు.
అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ‘A’ గా బ్యాంక్ సర్వీస్‌లలో చేరిన తర్వాత, కోర్సు విజయవంతంగా పూర్తయిన తర్వాత: గ్రేడ్ A లో అసిస్టెంట్ మేనేజర్‌లకు వర్తించే ప్రాథమిక వేతనం.

అర్హతలు:
కనీసం 60% మార్కులతో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేట్ (SC/ST/PWD కోసం 55 శాతం)

వయస్సు పరిమితి:
కనీసం: 21 సంవత్సరాలు
గరిష్టం: 28 సంవత్సరాలు

పూర్తి వివరాలు, దరఖాస్తుకు https://www/idbibank.in/ చూడండి.

ట్రెండింగ్ వార్తలు