పాలన చూసి ఎన్నుకోండి : మేం వద్దంటే.. మరొకరికి ఛాన్స్

సార్వత్రిక ఎన్నికలకు ఇంకా నాలుగు రోజులు మాత్రమే సమయం ఉంది. అధికార పార్టీ సహా పలు రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలో మునిగిపోయాయి.

  • Publish Date - April 6, 2019 / 12:17 PM IST

సార్వత్రిక ఎన్నికలకు ఇంకా నాలుగు రోజులు మాత్రమే సమయం ఉంది. అధికార పార్టీ సహా పలు రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలో మునిగిపోయాయి.

సార్వత్రిక ఎన్నికలకు ఇంకా నాలుగు రోజులు మాత్రమే సమయం ఉంది. అధికార పార్టీ సహా పలు రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలో మునిగిపోయాయి. అధికార పార్టీ బీజేపీ కూడా తమ ఐదేళ్ల పాలనలో చేసిన అభివృద్ధిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ జాతీయ ఎన్నికలపై ఓటర్లను ఉద్దేశించి ఒక సలహా ఇచ్చారు. గత ఐదేళ్లలో ప్రభుత్వం చేసిన పాలన, అభివృద్ధి పనులను ఆధారంగా చేసుకుని ప్రజలు తీర్పు ఇవ్వాలని అన్నారు.
Read Also : అందుకే హైదరాబాద్ నుంచి వచ్చేశా

నాగ్ పూర్ లోక్ సభ స్థానం నుంచి గడ్కరీ ఎన్నికల బరిలో దిగుతున్నారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఈసారి ఎన్నికలు.. మా పాలనకు ఓ పరీక్ష లాంటివి. ఐదేళ్ల పాలనలో అధికార పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలపై విశ్లేషించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ప్రజలు బీజేపీ పాలన బాగా లేదని భావిస్తే.. ఇతర పార్టీలకు అవకాశం వస్తుంది.. అంతే జరిగేది’ అని చెప్పారు. 

అధికారం కోసం రాజకీయాలని తాను అనుకోనని, రాజకీయాలు సమాజ శ్రేయస్సు కోసమేనని భావిస్తానని గడ్కరీ స్పష్టం చేశారు. దేశంలో మూడే మూడు అంశాలు (సామ్యవాదం, సమానత్వం, పెట్టుబడిదారీవిధానం) ప్రభావితం చేస్తాయని విశ్వసిస్తాం. కానీ, ఈ మూడింటి విషయంలో ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

దీనిపై తమ పార్టీ దృష్టిసారించిందని, జాతీయవాదం, మంచి పాలన అందించేందుకు బీజేపీ ఎప్పుడు ముందే ఉంటుందని గడ్కరీ తెలిపారు. 2014 ఎన్నికల ఫలితాల్లో కంటే వచ్చే జాతీయ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుస్తానని గతనెలలో గడ్కరీ శపథం చేశారు. తన నియోజవర్గంలో రూ.70వేల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్టు గడ్కరీ తెలిపారు. 
Read Also : మోడీ పచ్చి అబద్దాలకోరు: కేంద్రంలో చక్రం తిప్పేది మేమే