Hijab Row: ‘మేలి ముసుగు, తలపాగాలకు లేనిది హిజాబ్‌కు అనుమతివ్వరా’

విద్యాసంస్థల్లో హిజాబ్ నిషేదాన్ని ఛాలెంజ్ చేస్తూ హైకోర్టులో వేసిన పిటిషన్ తరపు వాదనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే నమ్మకం కావాలా.. చదువా అనే తరపు ప్రశ్నలు ఎదుర్కొంటున్నారు ముస్లిం...

Hijab Row: విద్యాసంస్థల్లో హిజాబ్ నిషేదాన్ని ఛాలెంజ్ చేస్తూ హైకోర్టులో వేసిన పిటిషన్ తరపు వాదనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే నమ్మకం కావాలా.. చదువా అనే తరపు ప్రశ్నలు ఎదుర్కొంటున్నారు ముస్లిం విద్యార్థులు. పిటిషనర్ తరపు సీనియర్ అడ్వకేట్ రవి వర్మ కుమార్ వాదనలు వినిపిస్తున్నారు.

‘చాలా మంది భారతీయులు వేషధారణలోనే మతాన్ని ప్రదర్శిస్తుంటారు. సమాజంలోని అన్ని వర్గాలలో మతపరమైన చిహ్నాల అపారమైన వైవిధ్యాన్ని మాత్రమే చూపుతున్నా. వాటిని పట్టించుకోకుండా ప్రభుత్వం ఒక్క హిజాబ్‌పైనే ఎందుకు ఈ వివక్ష చూపుతోంది?’

‘కేవలం మతం కారణంగా పిటిషనర్‌ను క్లాస్ రూం నుంచి బయటకు పంపుతున్నారు. బొట్టు ధరించిన అమ్మాయిని బయటకు పంపరు. గాజులు ధరించిన అమ్మాయిని బయటకు పంపరు. శిలువ ధరించిన క్రైస్తవుడిని తాకరు. ఈ అమ్మాయిలను మాత్రమే ఎందుకు? ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 15ను ఉల్లంఘించడమే’’ అని అడ్వకేట్ కుమార్ వివరించారు.

Read Also : హిజాబ్ ధరించకపోవడం వల్లే అత్యాచారాలు జరుగుతున్నాయి : కాంగ్రెస్ ఎమ్మెల్యే

మేలి ముసుగులను, గాజులు ధరించిన వారిని అనుమతిస్తారు. సిక్కు మతస్థుల తలపాగాలకు అభ్యంతరం ఉండదు. క్రైస్తవుల శిలువ గుర్తులకు ఇబ్బంది లేదెందుకు? అని ప్రశ్నించారు.

కర్ణాటక హైకోర్ట్ చీఫ్ జస్టిస్ రితూ రాజ్ అవస్థి, జస్టిస్ కృష్ణా ఎస్ దీక్షిత్, జస్టిస్ జేఎమ్ ఖాజీల ముగ్గురు జడ్జిల బెంచ్ హిజాబ్ కేసుపై విచారణ జరుపుతుంది. ఈ అంశంపై కోర్టులో విచారణ జరుగుతున్నంత కాలం విద్యార్థులకు ఎటువంటి మతపరమైన దుస్తులు ధరించకుండానే క్లాసులకు హాజరుకావాలని సూచించింది కోర్టు.

Read Also: మా అంతర్గత వ్యవహారంలో మీరు తలదూర్చకండి: హిజాబ్ పై విదేశాంగశాఖ వివరణ

ట్రెండింగ్ వార్తలు