Hijab Row : హిజాబ్ ధరించకపోవడం వల్లే అత్యాచారాలు జరుగుతున్నాయి : కాంగ్రెస్ ఎమ్మెల్యే

హిజాబ్ ధరించకపోవటం వల్లే దేశంలో అత్యాచారాలు జరుగుతున్నాయని కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ వ్యాఖ్యానించారు.

Hijab Row : హిజాబ్ ధరించకపోవడం వల్లే అత్యాచారాలు జరుగుతున్నాయి : కాంగ్రెస్ ఎమ్మెల్యే

Karnataka Congress Mla Comments On Hijab Row

Karnataka Congress MLA comments on hijab row : హిజాబ్ ధరించకపోవటం వల్లే దేశంలో అత్యాచారాలు జరుగుతున్నాయని కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ వ్యాఖ్యానించారు. కర్ణాటకలో మొదలైన ఈ హిజాబ్ వివదాదంపై పలువురు పలు విధాలుగా వ్యాఖ్యలుచేస్తున్నారు. హిజాబ్ ధరించటం, ధరించకపోవటం అనేది వారి ఇష్టమని..అది వారి వారి నమ్మకాలు, సంప్రదాయాలను బట్టి ఉంటుందని కొంమంది అంటుంటే..ధరించి తీరాల్సిందేనని మరికొంతమంది..హిజాబ్ ధరిస్తే కాలేజీల్లో అడుగు పెట్టనవివ్వం అని చెబుతున్నారు. ఈ హిజాబ్ వివాదం కాస్తా రాష్ట్రం ఎల్లలు దాటి అంతర్జాతీయ నేతలు కూడా వ్యాఖ్యానించే విధంగా రాద్ధాంతంగా మారింది. అలాగే దేశంలో ఏ సమస్యలు లేనట్లుగా హిజాబ్ వివాదం దేశంలో తీవ్ర చర్చకు దారితీసింది.

Also read : Pakistan ISI Hijab Row: హిజాబ్ వివాదాన్నిఅనుకూలంగా చేసుకుని భారత్ లో ISI కుట్రకు ప్లాన్: ఇంటెలిజెన్స్ వార్నింగ్

ఈ క్రమంలో కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హిజాబ్ ధరించకపోవడం వల్లే దేశంలో అత్యాచారాలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు.”ఇస్లాం పరిభాషలో ‘హిజాబ్’ అంటే ‘తెర’ అని అర్థం. ఆడపిల్లలు ఓ వయసుకు వచ్చిన తర్వాత అమ్మాయిల సౌందర్యాన్ని ఈ హిజాబ్ దాచి ఉంచుతుంది.

Also read :  Hizab :హిజాబ్ వివాదంపై పాక్ విమర్శలు..మా సమస్యను మేం చూస్కుంటాం..మీరు నీతులు చెప్పక్కర్లా

మహిళలు హిజాబ్ ధరించకపోతే రు అత్యాచారాలకు గురయ్యే అవకాశాలున్నాయని..అలా దేశంలో చాలామంది హిజాబ్ ధరించటంలేదని అందుకే అత్యాచారాలు జరుగుతున్నాయని..దేశంలో అత్యాచారాలు ఎక్కువగా జరుగుతుండడానికి కారణం హిజాబ్ ధరించకపోవటం వల్లేనని జమీర్ అహ్మద్ కొత్త విషయం చెబుతున్నట్లుగా వ్యాఖ్యలుచేశారు.

Also read :  Priyanka Gandhi Hijab : బికినీ అయినా, జీన్స్,బుర్ఖా ఏదైనా ధరించే హక్కు మహిళలకు ఉంది

అయితే హిజాబ్ ధరించడం తప్పనిసరి ఏమీ కాదని, ఎవరైతే తమను తాము కాపాడుకోవాలనుకుంటున్నారో వాళ్లు హిజాబ్ ధరించవచ్చని కూడా ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యే అన్నారు. ఇది ఎన్నో ఏళ్లుగా జరుగుతున్నదేనని అన్నారు.

Also read : Asaduddin Owaisi: ‘టోపీతో నేను పార్లమెంటుకు వెళ్లినప్పుడు ఆడపిల్లలు హిజాబ్ తో కాలేజికి వెళ్లకూడదా’