Pakistan ISI Hijab Row: హిజాబ్ వివాదాన్నిఅనుకూలంగా చేసుకుని భారత్ లో ISI కుట్రకు ప్లాన్: ఇంటెలిజెన్స్ వార్నింగ్

హిజాబ్ వివాదాన్ని అనుకూలంగా చేసుకుని భారత్ లో ISI కుట్రకు ప్లాన్ చేస్తోందని భారత ఇంటెలిజెన్స్ వార్నింగ్ ఇచ్చింది.'ఉర్దూస్థాన్'ను రూపొందించడానికి 'హిజాబ్‘ను వాడుకుంటోందని హెచ్చరిక

Pakistan ISI Hijab Row: హిజాబ్ వివాదాన్నిఅనుకూలంగా చేసుకుని భారత్ లో ISI కుట్రకు ప్లాన్: ఇంటెలిజెన్స్ వార్నింగ్

Pakistan Isi Hijab Rrow

Pakistan ISI hijab row: మన దాయాది దేశం పాకిస్థాన్ భారత్ లో ఏ చిన్న వివాదం తలెత్తినా పాక్ కళ్లన్ని భారత్ మీదనే ఉంటాయి. ముఖ్యంగా భిన్నత్వంలో ఏకత్వంగా ఉండే భారత్ లో మతాలకు సంబంధించిన విషయాలు వివాదంగా మారితే దాన్ని అనుకూలంగా చేసుకుని దాన్ని మరింత రెచ్చగొట్టడానికి అవకాశంగా మార్చుకోవటానికి కాచుకుని కూర్చుంటుంది. దీంట్లో భాగంగానే భారత్ లో ఇటీవల కాలంలో కర్ణాటక రాష్ట్రంలో కొనసాగుతున్న ‘హిజాబ్’ వివాదాన్ని తనకు అనుకూలంగా చేసుకుని భారత్ లో మరింత అశాంతిని రేకెత్తించటానికి హిజాబ్ వివాదాన్ని మరింత రెచ్చగొట్టి లబ్ది పొందేందుకు కుట్ర చేస్తోందని భారత్ ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి.

ఉర్దూస్థాన్’ ఏర్పాటుకు పాక్ కుట్ర..
రాజస్థాన్, ఢిల్లీ, యూపీ, బీహార్,పశ్చిమ బెంగాల్ ప్రాంతాలలో ‘ఉర్దూస్థాన్’ను రూపొందించడానికి ‘హిజాబ్ రెఫరెండం’ ఉద్యమాన్ని మరింత రెచ్చగొట్టే యత్నాలు చేస్తోందని.. భారతదేశంలోని ముస్లింలకు SFJ పిలుపునిచ్చినట్లు శుక్రవారం (ఫిబ్రవరి 11,2022) ఇంటిలెజెన్స్ విడుదల చేసిన ఇంటెల్ నోట్ పేర్కొంది.

కాగా..కర్నాటకలో హిజాబ్ వివాదంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. హిజాబ్ ధరించిన బాలికలను వేరుగా కూర్చోబెట్టడం, వారిని కాలేజ్‌ల్లోకి అనుమతించకపోవడంతో పరిస్థితులు చేదాటయనే చెప్పాలి.ఈ వివాదం కాస్తా చిన్నగా మొదలై చిలికిచిలికి గాలివానగా మారి పరిస్థితులు చేయి దాటిపోయాయి. దీంతో ఇరువ‌ర్గాల మ‌ధ్య‌ ఆగ్రహావేశాలు పెరిగిపోతున్నాయి. దీంతో విద్యాసంస్థలు మూడురోజులపాటు సెలవులు ప్రకటించారు.

సమయం వచ్చినప్పుడు స్పందిస్తాం : సుప్రీంకోర్టు
ఈ వివాదాన్ని మ‌రి పెద్ద‌దిగా చూడొద్దని సుప్రీంకోర్టు సూచించింది. ఈ వివాదంపై కర్ణాటక హైకోర్టులో విచారణలు జరుగుతున్నాయని..అక్కడ వచ్చే తీర్పుని బట్టి తాము స్పందిస్తామని..ఎప్పటికప్పుడు హిజాబ్ వివాదాన్ని గమనిస్తున్నామని దీనిపై సమయం వచ్చినప్పుడు స్పందిస్తామని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ స్పష్టంచేశారు.

హిజాబ్ వివాదాన్ని అనుకూలంగా చేసుకుని భారత్ లో పాక్ (ISI) కుట్ర..
ఇటువంటి ఉద్రిక్త‌త పరిస్థితుల మధ్య పాకిస్థాన్ గూఢచార సంస్థ (ISI) భారత్ లో అశాంతి మరింతగా రగిలించేందుకు రంగంలోకి దిగిందనీ..ఈ వివాదానికి ఆజ్యం పోసేలా పావులు క‌దుపుతోంద‌ని నిఘా వర్గాలు (ఇంటెల్ ఇన్‌పుట్‌లు) హెచ్చరిస్తున్నాయి. నిషేధిత ఖలిస్థానీ సంస్థ సిఖ్స్ ఫర్ జస్టిస్ (SJF) ద్వారా మరింత నిప్పు రగిలించే ప్రయత్నం చేస్తున్నట్టు నిఘావ‌ర్గాలు హెచ్చరించాయి. హిజాబ్ అంశాన్ని ఆధారంగా చేసుకుని.. భారత్ వ్యతిరేక శక్తులు… ఉర్దూయిస్థాన్ భావన పెంచేందుకు ప్రయత్నం చేయవచ్చంటూ ఇంటెలిజెన్స్ బ్యూరో పోలీసులు, ఇతర దర్యాప్తు సంస్థలను తాజాగా హెచ్చరించింది. ఈ క్రమంలో సిఖ్స్ ఫర్ జస్టిస్ చీఫ్ గురుపత్వాన్ర్ సింగ్ పన్నుతో చేతులు క‌లిపే అవ‌కాశముంద‌ని కూడా హెచ్చరించాయి. ఉగ్రవాద సంస్థ SFJ క‌దిలిక‌పై నిఘా ఉంచాల‌ని ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చ‌రించింది.

భారత్ లో ఉర్దూస్థాన్‌ను సృష్టించేందుకు ప్రజాభిప్రాయ సేకరణ ఉద్యమం..నిధుల సేకరణ
రాజస్థాన్, ఢిల్లీ, యుపి, బీహార్, పశ్చిమ బెంగాల్ ప్రాంతాలలో ‘ఉర్దూస్థాన్’ను రూపొందించడానికి ‘హిజాబ్ రెఫరెండం’ ఉద్యమాన్ని ప్రారంభించాలని భారతదేశంలోని ముస్లింలకు SFJ పిలుపునిచ్చినట్లు ఇంటెలిజెన్స్ బ్యూరో వెల్లడించింది. ఉర్దూస్థాన్‌ను సృష్టించేందుకు ప్రజాభిప్రాయ సేకరణ ఉద్యమాన్ని కూడా నిర్వహిస్తోందని..దీనికి కావాల్సిన నిధులను సమీకరిస్తామంటూ హామీఇవ్వడాన్ని పేర్కొంది. హిజాబ్ రిఫరెండం కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్లాట్‌ఫారమ్ ల్లో కొన్ని స్క్రీన్‌షాట్‌లు, ఫోటోలు సోషల్ వైరల్ అయ్యాయి. దేశంలో మత సామరస్యాన్ని దెబ్బ తీసేలా గురుపత్వంత్ సింగ్ పన్నూ చేసిన ప్రసంగం కూడా వైర‌ల్ అవుతోంది.

SFJ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ఈ విషయంపై SFJ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూన్ మాట్లాడుతూ.. భారతదేశంలో హిజాబ్ ధరించడంపై నిషేధం విధిస్తోందని తప్పుగా పేర్కొన్నారు. ముస్లీంల్లో భయాందోళనలకు గురిచేస్తున్నారు. భారతదేశంలో ‘హిజాబ్ నిషేధం’ తర్వాత అజాన్, నమాజ్, ఖురాన్‌లపై కూడా నిషేధం విధించబడుతుందని ఆరోపించారు.

‘‘మోడీ ప్ర‌భుత్వం.. భారత్ ను హిందూ దేశంగా మార్చాల‌ని భావిస్తున్నార‌నీ, మ‌రి, భారతదేశంలోని 200 మిలియన్ల ముస్లింలను ఏం చేయాలనుకుంటున్నారు? అని ప్ర‌శ్నించారు. హిజాబ్ రెఫరెండం ఉద్యమాన్ని ప్రారంభించమని..ఇది భారత్ విచ్చిన్నం చేయాలని భారత యూనియన్ నుండి ఉర్దూస్థాన్ అనే ముస్లిం దేశాన్ని సృష్టించాలి అని పిలుపు నిచ్చారు.

“1992లో.. బాబ్రీ మసీదును ధ్వంసం చేశారు, ఆ స‌మ‌యంలో ముస్లింలు నిశ్శబ్దంగా ఉన్నారు. ఆ త‌రువాత గుజరాత్‌లో ముస్లింల హత్యలు జరిగాయి. ఆ స‌మయంలో ముస్లింలు నిశ్శబ్దంగా ఉన్నారు. తాజాగా కాశ్మీర్‌ను స్వాధీనం చేసుకున్నారు. అయినా.. ముస్లింలు నిశ్శబ్దంగా ఉన్నారు. ఇప్పుడూ ముస్లీం మత విశ్వాసాలను సవాలు చేస్తున్నప్పుడు కూడా మీరు మౌనంగా ఉంటారా అని పన్నూరెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌లు చేశారు.

హిజాబ్ వివాదంపై పాకిస్థాన్ మంత్రులు విమర్శలు..తిప్పి కొట్టిన ఎంఐఎం అధినేత ఒవైసీ..
కాగా..భారత్ లోని కర్ణాటకలో జరిగే హిజాబ్ వివాదంపై పాకిస్థాన్ మంత్రులు కూడా స్పందిస్తూ తీవ్ర విమర్శలు చేశారు. ఇది ముస్లింలను అణచివేసే కుట్ర అని..ముస్లింలను విద్యకు దూరం చేసే కుట్రగా అభివర్ణించారు పాకిస్థాన్ మంత్రులు. పాక్ మంత్రుల వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ పాక్ కు ఘాటు కౌంటర్ ఇచ్చారు. ఇది భారత దేశం అంతర్గత వ్యవహారం..హిజాబ్ అనేది మా సమస్య మేం పరిష్కరించుకుంటాం..బాలికల విద్య గురించి మీరా మాకు నీతులు చెప్పేది..బాలికల విద్య కోసం పోరాడే మలాలా యూసఫ్ జాయ్ పై దాడి జరిగింది పాకిస్థాన్ లోనే అనే విషయం మర్చిపోయారా?మీ దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి..వాటిగురించి ఆలోచించండీ..మా సమస్యలను మేం పరిష్కరించుకోగలం అంటూ పాకిస్థాన్ కు అసదుద్దీన్ ఒవైసీ ఘాటు కౌంటర్ ఇచ్చారు.