Priyanka Gandhi Hijab : బికినీ అయినా, జీన్స్,బుర్ఖా ఏదైనా ధరించే హక్కు మహిళలకు ఉంది

కర్ణాటక హిజాబ్ వివాదంపై.. కాంగ్రెస్ జాతీయ నేత ప్రియాంక గాంధీస్పందించారు. ‘బికినీ,జీన్స్ అయినా, హిజాబ్ అయినా వారికి నచ్చినది ధరించే మహిళకు ఉంది అంటూ విద్యార్ధినిలకు మద్దతు పలికారు.

Priyanka Gandhi Hijab : బికినీ అయినా, జీన్స్,బుర్ఖా ఏదైనా ధరించే హక్కు మహిళలకు ఉంది

Karnataka Hijab..bjp Mla (1)

Priyanka Gandhi Hijab : కర్ణాటకలో హిజాబ్ వివాదం చిలికి చిలికి గాలివానగా మారుతోంది. ఎంతోమంది ప్రముఖులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈక్రమంలో‘హిజాబ్ ధరించే హక్కుంది..అంటూ కాంగ్రెస్ జాతీయ నేత ప్రియాంక గాంధీ సైతం హిజాబ్ వివాదంపై ఘాటుగా స్పందించారు. యువతులకు, మహిళలకు వారికి ఇష్టమైన డ్రెస్ ధరించే హక్కు ఉంది అంటూ విద్యార్ధినులకు ప్రియాంకా మద్దతు ఇచ్చారు.

ఎటువంటి దుస్తులు ధరించాలో నిర్ణయించుకోవడం మహిళల హక్కు అని..భారత రాజ్యాంగమే ఆ హక్కుకు హామీ ఇస్తున్నదని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ గుర్తు చేశారు. మహిళలు తాము బికినీ వేసుకోవాలా, ఘూంగ్‌హట్(చీర కొగుతో ముసుగు) పాటించాలా, జీన్స్ వేసుకోవాలా? లేక హిజాబ్ ధరించాలా అనేది ఆమె ఇష్టాన్ని బట్టే నిర్ణయించుకునే హక్కుందని స్పష్టం చేశారు.

Also read : Karnataka Hijab: మ‌హిళ‌ల ధరించే దుస్తులు రెచ్చగొట్టేలా ఉండటం వల్లే అత్యాచారాలు : బీజేపీ ఎమ్మెల్యే

వస్త్రధారణ విషయంలో అమ్మాయిలపై ఆంక్షలు విధించటం మానుకోవాలని..వారు ధరించి దుస్తుల విషయంలో వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో మహిళల ప్రోత్సాహం కోసం కాంగ్రెస్ ఇచ్చిన ‘లడ్కీ హు.. లడ్ సక్తీ హు..(నేను అమ్మాయినే.. పోరాడగలను)’ నినాదాన్ని కర్ణాటక హిజాబ్ నిరసనలకు సైతం జోడించారు ప్రియాంక.

హిజాబ్ వివాదంపై ప్రియాంక సోదరుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, కర్నాటక మాజీ సీఎం సిద్ధరామయ్య, కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్, కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ తదితరులు ఆందోళన చేస్తున్న విద్యార్థినులకు మద్దతిచ్చారు. హిజాబ్ ధరించారనే సాకుతో అమ్మాయిలను చదువుకు దూరం చేయాలనుకుంటే సహించేది లేదని హెచ్చరించారు.

కాగా కర్ణాటకలోని మాండ్యా జిల్లాలోని ఓ కాలేజీలో పదుల సంఖ్యలో యువకుల గుంపు జైశ్రీరాం నినాదాలు చేస్తూ బుర్ఖా ధరించిన ముస్లిం విద్యార్థినిని చుట్టుముట్టడం, ఆమె అల్లా హో అక్బర్ అంటూ గట్టిగా కేకలు వేసిన వీడియో ఒకటి వైరలైంది. ఈ వీడియోపై మహిళా హక్కుల కార్యకర్త, నోబెల్ శాంతి పురస్కార గ్రహీత మలాలా యూసఫ్‌జాయ్ కూడా స్పందించారు. ‘హిజాబ్ ధరించిన అమ్మాయిలను.. చదువా, హిజాబా ఏదో ఒకటి ఎంచుకోవాలని ఒత్తిడి చేయడం చాలా భయానకం’అని..హిజాబ్ ధరించిన అమ్మాయిలను చులనకగా చూడవద్దని కోరారు.

Also read : Imran Khan: మగాళ్లు రోబోలు కాదు.. ఆడవారి దుస్తులపై పాక్ ప్రధాని!

ఆడపిల్లలు పుట్టినప్పటినుంచి అలా ఉండాలి. ఇలా ఉండాలి? బయటకు వెళితే నవ్వకూడదు..అనే ఆంక్షలు భారత్ లో ఉన్నాయి. ఎటువంటి బట్టలు వేసుకోవాలి? ఎలాంటివి వేసేకోకూడదు అనే ఆంక్షలు ఇంట్లోనే కాదు విద్యాసంస్థల్లో కూడా పెరుగుతున్నాయి. ఆయా విద్యాసంస్థలు ఇలాంటి బట్టలే ధరించాలనే రూల్స్ పెడుతున్నాయి. ఇటువంటి ఆంక్షలు మతపరమైన వివాదాలకు కారణాలుగా మారుతున్నాయి. ప్రస్తుతం కర్ణాటకలో చెలరేగుతున్నది అదే. తాము పెట్టిన రూల్ ప్రకారం యూనిఫాంలు మాత్రమే ధరించాలని..అది ముస్లింలు అయినా సరే అంటూ రూల్ పెట్టారు కాలేజీలు. ఇది ముస్లిం యువతులకు ఇబ్బందిగా మారింది.

స్కూళ్లు, కాలేజీల్లో ముస్లిం విద్యార్థినులు హిజాబ్(బుర్ఖా) ధరించకూడదని యూనిఫాంలు మాత్రమే ధరించాలనే కర్ణాటకలో చెలరేగిన వివాదం రాష్ట్ర వ్యాప్తంగా ఘర్షణపూర్తిత వాతావరణానికి దారి తీసింది. కలిసి, మెలిసి చదువుకుంటున్న విద్యార్థుల మధ్య వివాదాలకు కేంద్రంగా మారింది. విద్యార్ధులు వర్గాలుగా విడిపోయి వివాదాస్పద వ్యాఖ్యలు చేసుకునేలా మారింది. దీంతొ అన్ని స్కూళ్లు, కాలేజీలను ప్రభుత్వం మూసేయించింది.హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టులో ఉత్కంఠభరిత వాదనలు కొనసాగుతున్నాయి. ఈ ఉదంతంపై దేశవ్యాప్త చర్చ నడుస్తోంది.