Karnataka Hijab: మ‌హిళ‌ల ధరించే దుస్తులు రెచ్చగొట్టేలా ఉండటం వల్లే అత్యాచారాలు : బీజేపీ ఎమ్మెల్యే

మ‌హిళ‌ల ధరించే దుస్తులు రెచ్చగొట్టేలా ఉండటం వల్లే అత్యాచారాలు, లైంగిక వేధింపులు జరుగుతున్నాయని బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు.ప్రియాంకా గాంధీ బికిని ట్వీట్ దిగ‌జారుడు ప్ర‌క‌ట‌న‌.

Karnataka Hijab: మ‌హిళ‌ల ధరించే దుస్తులు రెచ్చగొట్టేలా ఉండటం వల్లే అత్యాచారాలు : బీజేపీ ఎమ్మెల్యే

Karnataka Hijab..bjp Mla

Karnataka Hijab..BJP MLA : యువతులు,మహిళలు ధరించే దుస్తులపై క‌ర్నాట‌క బీజేపీ ఎమ్మెల్యే రేణుకాచార్య వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలోని హిజాబ్ ర‌గ‌డ‌పై ప్రియాంక గాంధీ చేసిన ట్వీట్‌కు స్పందిస్తూ రేణుకాచార్య చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర క‌ల‌క‌లం సృష్టిస్తున్నాయి. ప్రియాంక గాంధీ ఈ వివాదంపై ట్వీట్ చేస్తూ..గూంగ‌ట్‌.. హిజ‌బ్‌.. బికినీ ఏదైనా సరే ధరించే హక్కు మహిళలకు ఉందని పేర్కొన్నారు.

Also read : Imran Khan: మగాళ్లు రోబోలు కాదు.. ఆడవారి దుస్తులపై పాక్ ప్రధాని!

ఈ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే రేణుకాచార్య స్పందిస్తూ..ప్రియాంకా గాంధీ బికినీ ట్వీట్ దిగ‌జారుడు ప్ర‌క‌ట‌న‌ అని అభివర్ణించారు. అంతేకాదు కాలేజీకి వెళ్లే ఆడపిల్లలు ఎటువంటి బట్టలు ధరించాలి? ఎలా ఉండాలి? అని సలహాలు కూడా ఇచ్చారు ఎమ్మెల్యే. ‘‘కాలేజ్‌లో చ‌దివే పిల్ల‌లు శ‌రీరం కనిపించకుండా పూర్తిగా బ‌ట్ట‌లు కప్పలా ఉన్న డ్రెస్సులు ధ‌రించాల‌ని చెప్పుకొచ్చారు. అక్కడితో ఊరుకోకుండా..యువతులు,మ‌హిళ‌లు రెచ్చగొట్టేలా ఉన్న దుస్తుల ధరించటంవల్లలనే అత్యాచారాలు, లైంగిక వేధింపులు జరుగుతున్నాయని అన్నారు. లైంగిక దాడుల ఘ‌ట‌న‌లు పెరగటానికి తున్నాయ‌ని, మ‌హిళ‌ల దుస్తులు పురుషుల‌ను రెచ్చ‌గొట్టేలా ఉంటున్నాయ‌ని అన్నారు. మ‌హిళ‌లు నిండుగా బ‌ట్ట‌లు ధ‌రించాల‌ని, మ‌న దేశంలో ఆడవారికి గౌర‌వం ఉంద‌ని చెప్పుకొచ్చారు.

Also read : Karnataka : కర్ణాటకలో హిజాబ్ వివాదం..యూనిఫాం ధరించాలి

కర్ణాట‌కలో హిజాబ్ వివాదంపై బుధ‌వారం (ఫిబ్రవరి 8,2022)ప్రియాంక గాంధీ క్లాస్‌రూంల్లో హిజాబ్ ధ‌రించ‌డంపై నిషేధం విధించ‌టంపై విద్యార్ధినుల‌కు మ‌ద్ద‌తుగా ప్రియాంక ట్వీట్ చేశారు. అమ్మాయిలు ఎటువంటి దుస్తులు ధ‌రించాలన్న‌ది విద్యార్ధినుల ఇష్టం..రాజ్యాంగం వారికి ఆ హ‌క్కును ఇచ్చిందని పేర్కొన్నారు. బికినీ లేదా, జీన్స్ లేదా హిజాబ్..ఇలా ఏం ధ‌రించాల‌నేదని మ‌హిళ‌ల ఇష్ట‌మ‌ని, ఇది వారికి రాజ్యాంగం క‌ల్పించిన హ‌క్క‌ు అని పేర్కొన్నారు. ప్రియాంక గాంధీ ట్వీట్‌కు మ‌ద్ద‌తుగా రాహుల్ గాంధీ థంబ్సప్ ఎమోజీ పెట్టి మద్దతు తెలిపారు.