Karnataka : కర్ణాటకలో హిజాబ్ వివాదం..యూనిఫాం ధరించాలి

ఉడుపి జిల్లాలో విద్యార్థులు కాషాయ కండువాలు కప్పుకొని జై శ్రీరాం అని నినాదాలు చేయడంతో పరిస్థితి దిగజారకుండా కర్ణాటక ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం.

Karnataka : కర్ణాటకలో హిజాబ్ వివాదం..యూనిఫాం ధరించాలి

Hizab

Hijab Row : కర్ణాటకలో హిజాబ్‌ వివాదం చినికి చినికి గాలివానలా మారడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సమానత్వాన్ని, సమగ్రతను, శాంతి భద్రతలకు భంగం కలిగించే దుస్తులను ధరించి స్కూళ్లకు హాజరు కావద్దంటూ ఆదేశించింది. కర్ణాటకలో నెల రోజులుగా హిజాబ్‌ అంశం రాష్ర్టాన్ని కుదిపేస్తోంది. ముస్లిం విద్యార్ధులు హిజాబ్‌ ధరించి కాలేజీలకు రావడాన్ని వ్యతిరేకిస్తూ కొన్ని కాలేజీల్లో విద్యార్థులు కాషాయ కండువాల కప్పుకొని హాజరవుతున్నారు. శనివారం ఉడుపి జిల్లాలో విద్యార్థులు కాషాయ కండువాలు కప్పుకొని జై శ్రీరాం అని నినాదాలు చేయడంతో పరిస్థితి దిగజారకుండా కర్ణాటక ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం.

Read More : Equality Statue : తిరునామం, పంచెకట్టుతో మోదీ.. మురిసిపోయిన ముచ్చింతల్

విద్యార్థులందరూ తప్పనిసరిగా యూనిఫాంనే ధరించాలని, అన్ని విద్యాసంస్థల్లో ఈ నియమం వర్తిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. హైకోర్టు తీర్పు వచ్చే వరకు ప్రభుత్వ ఆదేశాలను పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ క్రమంలో హిజాబ్ ధ‌రించార‌నే కార‌ణంలో ఉడుపి జిల్లాలోని ప‌లు విద్యాసంస్థల్లో విద్యార్థినులను క్లాసులోకి అనుమతించలేదు. ముస్లిం విద్యార్థినులను విద్యాసంస్థల‌ గేటు వద్దే అడ్డుకుంటున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి.

Read More : U19 World Cup: అండర్-19 టీం విన్నర్లకు బీసీసీఐ రూ.40 లక్షల రివార్డు

కర్ణాటక రాష్ట్రంలో పలు కళాశాలల్లో ముస్లిం విద్యార్థినిలు బురఖా ధరించి రావడంపై ఇతర విద్యార్థి వర్గాలు చేస్తున్న నిరసనలు కొనసాగాయి. మొదటి ఉడిపి జిల్లాలో ప్రారంభమైన ఈ నిరసనలు ప్రస్తుతం మరో మూడు జిల్లాలకు వ్యాపించాయి. అదే సమయంలో విద్యాసంస్థల్లో మతపరమైన దుస్తులు ధరించడంపై అధికార బీజేపీ నేతలు ఖండిస్తున్నారు. చదువుకునే విద్యార్థులు మతపరమైన దుస్తులు ధరించి.. చదువుకు విలువ లేకుండా చేస్తున్నారంటూ బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.