Asaduddin Owaisi: ‘టోపీతో నేను పార్లమెంటుకు వెళ్లినప్పుడు ఆడపిల్లలు హిజాబ్ తో కాలేజికి వెళ్లకూడదా’

కర్ణాటకలో హిజాబ్ కాంట్రవర్సీ రాజుకుంటున్న వేళ అసదుద్దీన్ ఒవైసీ బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారు. తాను టోపీ పెట్టుకుని పార్లమెంటుకు వెళ్లగలిగినప్పుడు...

Asaduddin Owaisi: ‘టోపీతో నేను పార్లమెంటుకు వెళ్లినప్పుడు ఆడపిల్లలు హిజాబ్ తో కాలేజికి వెళ్లకూడదా’

Asaduddin Owaisi: కర్ణాటకలో హిజాబ్ కాంట్రవర్సీ రాజుకుంటున్న వేళ అసదుద్దీన్ ఒవైసీ బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారు. తాను టోపీ పెట్టుకుని పార్లమెంటుకు వెళ్లగలిగినప్పుడు కర్ణాటకలో స్కూల్స్ కు హిజాబ్ ధరించి ఎందుకు వెళ్లకూడదని ప్రశ్నించారు.

‘నేను భారత రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నా. సుప్రీం కోర్టు తీర్పుల గురించి మాట్లాడుతున్నా. నేను పార్లమెంటుకు టోపీ పెట్టుకుని వెళ్లినప్పుడు.. ఒక బాలిక హిజాబ్ ధరించి కాలేజీకి ఎందుకని వెళ్లకూడదు? 014, 2017, 2019లలో బీజేపీ ఎలా గెలిచింది. వాళ్లకు 300 సీట్లు వచ్చాయి. సెక్యూలర్ పార్టీలన్నీ ఈ తప్పుదోవ వైఖరి పట్ల కళ్లు, చెవులు మూసుకుంటున్నాయి’ అని అన్నారు ఒవైసీ.

ప్రతిపక్ష పార్టీలను ప్రవ్నిస్తూ… వారికి ఎవరు ఓట్లు వేశారు. మాట్లాడటానికి ఎందుకు భయపడుతున్నారు. అని ఇంగ్లీష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశ్నించారు.

Read Also: వయసు నాలుగు పదులు దాటినా తగ్గని ఘాటు!

కర్ణాటక సీఎం విద్యార్థులంతా శాంతి, సామరస్యంతో ఉండాలని పిలుపునిస్తూ మూడు రోజుల పాటు విద్యాసంస్థలు మూసేయాలని పిలుపునిచ్చారు.

ఫిబ్రవరి 4న ఉడుపిలో గవర్నమెంట్ గర్ల్స్ పీయూ కాలేజీ వేదికగా ఈ హిజాబ్ ఆందోళనలు మొదలయ్యాయి. పలువురు స్టూడెంట్లు తాము ఇతరులు హిజాబ్ ధరించినందుకుగానూ క్లాసులు హాజరుకామంటూ డిమాండ్ చేశారు.