Minister Kiren Rijiju : లాయర్లు లక్షల్లో ఫీజులు తీసుకోవటం వల్ల సామాన్యులకు న్యాయం దూరమవుతోంది : కేంద్ర మంత్రి

కేసులు వాదించటానికి లాయర్లు తీసుకునే ఫీజుల విషయంపై కేంద్రం న్యాయశాఖా మంత్రి కిరణ్ రిజిజు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రముఖ లాయర్లు లక్షల్లో ఫీజులు తీసుకుంటున్నారని ఇలా అయితే సామాన్యుల పరిస్థితి ఏంటి?అంటూ ఆవేదన వ్యక్తంచేశారు.

Lawyers Charge Rs 10 Lakh Per Hearing (1)

lawyers charge Rs 10-15 lakh per hearing..Law Minister Kiren Rijiju  : కేసులు వాదించటానికి లాయర్లు తీసుకునే ఫీజుల విషయంపై కేంద్రం న్యాయశాఖా మంత్రి కిరణ్ రిజిజు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రముఖ లాయర్లు రూ.10- నుంచి 15 లక్షలు ఫీజులు తీసుకుంటున్నారని ఇలా అయితే సామాన్యుల పరిస్థితి ఏంటి?అంటూ ఆవేదన వ్యక్తంచేశారు. ఇలా భారీగా ఫీజులు తీసుకోవటం వల్ల సామాన్యులకు న్యాయం దూరం అవుతోంది అని అన్నారు. ఇంతంత ఫీజులు తీసుకోవటం వల్ల దేశంలో పేదలు, సామన్యులకు న్యాయం అందకుండాపోతోందని అన్నారు.

ఏదన్నా కేసు వాదించాల్సిన అవసరం వస్తే డబ్బున్నవారు పెద్ద పెద్ద లాయర్లను (ప్రముఖ లాయర్లు) ఏర్పాటు చేసుకుంటారు వారు అడిగినంత ఫీజులు ఇచ్చుకోగలరు..అదే పేదవారికి అటువంటి పరిస్థితి ఉండదు..అలా అయితే ఇక పేదవారిని న్యాయం ఎలా అందుతుంది అంటూ జైపూర్‌లో జరిగిన 18వ ఆల్ ఇండియా లీగల్ సర్వీసెస్ అథారిటీస్ మీట్‌లో రిజియు మాట్లాడుతూ ఆవేదనగా ప్రశ్నించారు.

ఈ సందర్భంగా మంత్రి కిరణ్ రిజుసి మాట్లాడుతూ..సుప్రీంకోర్టులో కొంతమది లాయర్లు వసూలు చేసే ఫీజులను సామన్యులు భరించలేరని అన్నారు. సుప్రీంకోర్టులో కొంతమంది లాయర్లు ఒక్కో విచారణకు (హియరింగ్‌) రూ.10-15 లక్షలు చార్జీ వసూలు చేస్తుంటారని అంత భారీ ఫీజులను సామాన్యులు ఎలా చెల్లించుకోగలరు?’’ అని ప్రశ్నించారు. జులై 18న ప్రారంభమయ్యే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో వాడుకలో లేని 71 చట్టాలను రద్ధు చేయనున్నామని మంత్రి తెలిపారు.

మంత్రి పాల్గొన్న 18వ ఆల్ ఇండియా లీగల్ సర్వీసెస్ అథారిటీస్ సమావేశంలో రాజస్థాన్ సీఎం గెహ్లాట్ కూడా హాజరయ్యారు. ఈ సమావేశంలో గెహ్లాట్ మాట్లాడుతూ మరోసారి బీజేపీపై విమర్శలు చేశారు.బీజేపీ నుంచి సస్పెండెడ్ అయిన నుపుర్ శర్మ విషయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల వ్యాఖ్యలకు వ్యతిరేకంగా.. నడుస్తున్న ఉద్యమం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. హార్స్ ట్రేడింగ్ ద్వారా ప్రభుత్వాలను మారుస్తున్నారంటూ బీజేపీపై మరోసారి విమర్శలు చేశారు.