Delhi CM Kejriwal: నేడు సిసోడియా బీజేపీలో చేరితే.. రేపు జైలు నుంచి విడుదల అవుతారు కదా?: కేజ్రీవాల్

కేంద్ర ప్రభుత్వంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ... "ఒకవేళ మనీశ్ సిసోడియా ఇవాళ బీజేపీలో చేరితే రేపు ఆయన జైలు నుంచి విడుదల అవుతారు కదా? అన్ని కేసులనూ తొలగిస్తారు. అవినీతి జరగడం అనేది వాళ్లకి సమస్య కాదు. అభివృద్ధి పనులను ఆపడం, ప్రతిపక్షాల మీదకు సీబీఐ-ఈడీని పంపడమే వారికి ముఖ్యం" అని విమర్శించారు.

Delhi CM Kejriwal: కేంద్ర ప్రభుత్వంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ… “ఒకవేళ మనీశ్ సిసోడియా ఇవాళ బీజేపీలో చేరితే రేపు ఆయన జైలు నుంచి విడుదల అవుతారు కదా? అన్ని కేసులనూ తొలగిస్తారు. అవినీతి జరగడం అనేది వాళ్లకి సమస్య కాదు. అభివృద్ధి పనులను ఆపడం, ప్రతిపక్షాల మీదకు సీబీఐ-ఈడీని పంపడమే వారికి ముఖ్యం” అని విమర్శించారు.

“దేశానికి మెడల్స్ తెలిచ్చిన ఇద్దరిని ప్రధాని మోదీ జైలుకు పంపారు. మద్యం విధానం అన్నది కేవలం ఒక సాకు మాత్రమే. మద్యం విధానంలో కుంభకోణం ఏమీ లేదు. ఢిల్లీలో జరుగుతున్న మంచి పనులను అడ్డుకోవాలని ప్రధాని భావిస్తున్నారు. విద్యా రంగంలో మంచి పనులు చేసినందుకు మనీశ్ సిసోడియాను అరెస్టు చేశారు. ఆరోగ్య రంగంలో మంచి పనులు చేసినందుకు సత్యేందర్ జైన్ ను అరెస్టు చేశారు” అని కేజ్రీవాల్ మండిపడ్డారు.

కాగా, ఇంటింటికీ వెళ్లి ప్రధాని మోదీ తీరు గురించి ప్రతి ఒక్కరికీ వివరించే కార్యక్రమాన్ని చేపడతామని కేజ్రీవాల్ చెప్పారు. అప్పట్లో ఓ సారి మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఎలా తీవ్ర నిరంకుశత్వంగా వ్యవహరించారో, అలాగే ఇప్పుడు మోదీ కూడా అదే దారిలో వెళ్లేందుకు సిద్ధమవుతున్నారని చెబుతామని అన్నారు. ప్రజలే మంచి సమాధానం ఇస్తారని వారు ప్రతి విషయాన్ని గమనిస్తున్నారని, ఆగ్రహంగా ఉన్నారని చెప్పారు.

Manish Sisodia: సీబీఐ లాకప్‌లో మనీశ్ సిసోడియాకున్న సదుపాయాలేంటో తెలుసా?

ట్రెండింగ్ వార్తలు