రేప్ బాధితురాలిలా ఫీల్ అవుతున్నా.. క్షమాపణ కోరిన స్పీకర్

తన పరిస్థితి  రేప్ బాధితురాలిలా తయారైందంటూ మంగళవారం(ఫిబ్రవరి-12,2019) కర్ణాటక అసెంబ్లీ  స్పీకర్ రమేష్ కుమార్ చుేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవడంతో బుధవారం(ఫిబ్రవరి-13,2019) స్పందించిన రమేష్ కుమార్..తన కామెంట్లు ఎమ్మెల్యేలను భాధించి ఉంటే క్షమాపణలు చెబుతున్నానని అన్నారు. ఈ ఇష్యూని మీడియా హైప్ చేసిందని యన అన్నారు.
కర్ణాటక బడ్జెట్‌ సమావేశాల క్రమంలో ‘ఆపరేషన్‌ కమలం’కు సంబంధించిన ఆడియో టేపులను ముఖ్యమంత్రి కుమారస్వామి విడుదల చేసి సంచలనం సృష్టించారు. ఈ సమయంలో మంగళవారం 50 కోట్ల రూపాయలతో తనను ప్రలోభపెట్టాలని యత్నించారనే వివాదాస్పద ఆడియో టేప్‌పై  స్పీకర్ రమేశ్ కుమార్  మాట్లాడుతూ.. తన పరిస్థితి రేప్ బాధితురాలిలా తయారైందని..బాధితురాలు ఒకసారి అత్యాచారానికి గురైతే..కోర్టులో నిందితుడి తరపు న్యాయవాది రేప్ ఎలా జరిగింది? ఎంత సేపు జరిగింది? అని గుచ్చిగుచ్చి ప్రశ్నించినట్టుగా ఉందని..తన పరిస్థితి అత్యాచార బాధితురాలికంటే అధ్వాన్నంగా ఉందన్నారు.తన పరిస్థితిని వివరిస్తు ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.