ఆస్తుల ధ్వంసానికి పాల్పడితే కాల్చేయండి : రైల్వే మంత్రి ఆదేశం

పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఎవరైనా రైల్వే ఆస్తులను ధ్వంసం చేస్తే కాల్చిపారేయాలని రైల్వే అధికారులను ఆ శాఖ సహాయ మంత్రి సురేశ్‌ అంగాడీ ఆదేశించారు.

  • Publish Date - December 18, 2019 / 04:26 AM IST

పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఎవరైనా రైల్వే ఆస్తులను ధ్వంసం చేస్తే కాల్చిపారేయాలని రైల్వే అధికారులను ఆ శాఖ సహాయ మంత్రి సురేశ్‌ అంగాడీ ఆదేశించారు.

పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఎవరైనా రైల్వే ఆస్తులను ధ్వంసం చేస్తే కాల్చిపారేయాలని రైల్వే అధికారులను ఆ శాఖ సహాయ మంత్రి సురేశ్‌ అంగాడీ ఆదేశించారు. ఇటీవల పశ్చిమబెంగాల్‌లోని ముర్షిదాబాద్‌ జిల్లాలో కొందరు నిరసనకారులు రైల్వేస్టేషన్‌కు నిప్పుపెట్టారు. ఈ నేపథ్యంలోనే రైల్వే ఆస్తుల ధ్వంసానికి పాల్పడే వారిని కాల్చివేయండని ఆయన ఆదేశించారు. 

కేంద్ర హోంశాఖ తొలి మంత్రిగా పని చేసిన వల్లభాయ్‌పటేల్‌ బతికి ఉంటే ఎలాంటి చర్యలు తీసుకునేవారో.. అలాంటి చర్యలను తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. కేంద్రమంత్రి హోదాలోనే ఈ ఆదేశాలు జారీ చేశానని ఓ మీడియా సంస్థతో సురేశ్‌ అంగాడీ చెప్పారు. అయితే సురేష్‌ అంగాడీ వ్యాఖ్యలను ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుబట్టాయి.

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు ఉదృతంగా కొనసాగుతూనే ఉన్నాయి. ఢిల్లీలో జామియా మిలియా యూనివర్శిటీలో జరిగిన అల్లర్ల వేడి ఇంకా చల్లారకముందే మరోసారి ఈస్ట్ ఢిల్లీలో మంగళవారం(డిసెంబర్-17,2019) నిరసనకారులు రెచ్చిపోయారు. పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా జఫరాబాద్ ఏరియాలో నిరసనకారులు చేపట్టిన ప్రదర్శన ఒక్కసారిగా కట్టుతప్పింది.

ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వడంతో పాటు బస్సులు, ద్విచక్ర వాహనాలకు నిప్పుపెట్టడంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. పలువురు ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనా స్థలికి అదనపు బలగాలను రప్పించారు. ప్రజలు ఆందోళనలకు దూరంగా ఉండాలని, రోడ్లపైకి రావద్దని, ప్రశాంతంగా ఉండాలని అటు పోలీసులు పిలుపునిచ్చారు.
 

ట్రెండింగ్ వార్తలు