Health tips: మెరిసే చర్మం కావాలా.. అయితే ఇలా ట్రై చేసి చూడండి …

మెరిసే చర్మంకోసం యువతులు, మహిళలు అనేక క్రీములు వాడుతుంటారు. ముఖంపై నల్లటి మచ్చలు వారి ముఖాన్ని అందంగా కనిపించకుండా అడ్డుకుంటాయి. ఏదో క్రీములు వాడి వాటిని కనిపించకుండా చేసినా అది ఆ సమయం వరకే. మళ్లీ ముఖం కడుక్కుంటే మచ్చలే కనిపిస్తాయి. ఖరీదైన క్రీములు, పూతలతోనే మచ్చల్లేని మెరిసే...

Health tips: మెరిసే చర్మంకోసం యువతులు, మహిళలు అనేక క్రీములు వాడుతుంటారు. ముఖంపై నల్లటి మచ్చలు వారి ముఖాన్ని అందంగా కనిపించకుండా అడ్డుకుంటాయి. ఏదో క్రీములు వాడి వాటిని కనిపించకుండా చేసినా అది ఆ సమయం వరకే. మళ్లీ ముఖం కడుక్కుంటే మచ్చలే కనిపిస్తాయి. ఖరీదైన క్రీములు, పూతలతోనే మచ్చల్లేని మెరిసే, మృదువైన చర్మం రాదు. లోపల్నుంచీ పోషణ కావాలి. మనం తినే ఆహారంలో పండ్లు, ఇతర పదార్థాలు ఉండేలా జాగ్రత్త పడాలి. ముఖంపై వృధ్ధాప్య ఛాయలు ఉండకుండా, మచ్చలు ఏర్పడకుండా ఉండే పదార్థాలను ఎంచుకొని ఆహారంగా తీసుకోవాలి. అప్పుడే మెరిసే చర్మం మన సొంతం అవుతుంది. మెరిసే చర్మం కోసం ఈ కింది ఆహార పదార్థాలు తీసుకుంటే కొంత మేరకు ఉపయోగం ఉండే అవకాశాలు ఉన్నాయి.

Tomato

టమాట : టమాటాలో విటమిన్-సి గుణాలెక్కువ. పెద్ద మొత్తంలో ఉండే లైకోపిన్ వృద్ధాప్య ఛాయల్నే కాదు గుండె వ్యాధుల్నీ దరిచేరనివ్వదు. అయితే బాగా ఉడికించి తినాలి. అప్పుడే ఈ యాంటీ ఆక్సిడెంట్ శరీరానికి అందుతుంది.

Cinnamon

దాల్చిన చెక్క : జిడ్డు చర్మం ఉన్నవారికి దివ్యౌషధంగా దాల్చిన చెక్క పనిచేస్తుంది. టీ, పండ్ల రసాలు, స్మూతీల్లో దీన్ని చేర్చుకోండి. రక్తంలో చెక్కర స్థాయిలనే కాదు చర్మంలో నూనె ఉత్పత్తినీ తగ్గిస్తుంది. ఇక మొటిమలకు వచ్చే అవకాశాల చాలా తక్కువగా ఉంటాయి.

Avocado

అవకాడో : ముడతలు, పిగ్మెంటేషన్ బాధిస్తున్నట్లయితే.. అవకాడోను తెచ్చుకోవటం మంచిది. దీనిలో ఎక్కువ మొత్తంలో ఉండే మోనోశాచ్యురేటెడ్ కొవ్వులు చర్మానికి ఆరోగ్యాన్నిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు ప్రీరాడికల్స్ తో పోరాడతాయి.

Chia

చియా : ఒమెగా 3 ఫ్యాటీ ఆసిడ్లు ఎక్కువ. దీనిలోని పోషకాలు చర్మకణాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. కొలాజెన్ ఉత్పత్తిని పెంచి చర్మంపై ముడతలు రాకుండా అడ్డుకుంటాయి.

 

Ginger

అల్లం: దీనిలో యాంటీ యాక్సిడెంట్లు, యాంటీ ఇన్ ప్లమేటరీ గుణాలెక్కువ. ఇవి చర్మపొరల్ని ఆరోగ్యవంతం చేయడమే కాక అలర్జీల నుంచీ కాపాడుతాయి.

Dark Chocolate

డార్క్ చాక్లెట్: ఫాలీఫినాల్స్, ప్లావనాల్స్ ఇంకా ఇతర యాంటీ ఆక్సిడెంట్లు దీనిలో పుష్కలంగా లభిస్తాయి. ఇవి ఎండ నుంచి చర్మాన్ని రక్షించడమే కాకుండా వృద్ధాప్య ఛాయలను నెమ్మదింపజేస్తాయి.

ట్రెండింగ్ వార్తలు