సరికొత్త మాస్క్…30 సార్లు ఉతికి వాడుకోవచ్చు

  • Publish Date - August 5, 2020 / 10:10 AM IST

కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు శాస్త్రవేత్తలు కొత్త కొత్త మాస్క్ లను తయారు చేస్తున్నారు. తుమ్మినా, దగ్గినా..వెలువడే తుంపర్లను అడ్డుకొనే న్యూ మాస్క్ ను తయారు చేశారు. ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) సైంటిస్టులు వీటిని రూపొందించారు. దీనికి సాన్స్ ఫేస్ మాస్క్ అని పేరు పెట్టారు.



మూడు, నాలుగు పొరలు కలిగి ఉంటుంది. హైడ్రోఫోబిక్ పాలిమర్లతో బ్యాక్టీరియా, వైరస్ లను సమర్థంగా నిలువరించనుందని తెలిపారు. తుమ్మినా, దగ్గిన సమయంలో వెలువడే తుంపర్లలో 0.3 మైక్రాన్ల పరిమాణం వరకు ఈ మాస్కు నిలువరిస్తుందని ఐఐసీటీ సీనియర్ ప్రిన్స్ పల్ శాస్త్రవేత్త, ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీధర్ తెలిపారు.



ఈ మాస్క్ ధరించడం వల్ల 60 నుంచి 70 శాతం వరకు వైరస్ రాకుండా అడ్డుకుంటుందన్నారు. ఇక ఇందులో మరో స్పెషాల్టీ ఉందని, ఈ ఫేస్ మాస్క్ ను ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా 30 సార్లు ఉతికి వాడొచ్చన్నారు. సుమారు రెండు, మూడు నెలల వరకు పనికొస్తుందన్నారు.

ఈ మాస్క్ లను పెద్ద ఎత్తున ఉత్పత్తికయ్యే ఖర్చును భరించేందుకు సిప్లా ఫౌండేషన్ ముందుకొచ్చిందని ఐఐసీటీ ప్రధాన శాస్త్రవేత్త డి.శైలజ తెలిపారు. సిప్లా ప్రతినిధులతో కిసి సంస్థ డీజీ శేఖర్ మండే మంగళవారం ప్రాజెక్టును ప్రారంభించారు.