IIT-Kharagpur : ఖరగ్ పూర్ ఐఐటీ స్టూడెంట్లకు బంపర్ ఆఫర్.. ఏడాదికి రూ.2 కోట్ల ప్యాకేజీ

కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతున్నా...ఐఐటీ ఖరగ్ పూర్ ప్రీ ప్లేస్ మెంట్ ఆఫర్లు పొందడం విశేషం. 35 అంతర్జాతీయ ఆఫర్లను పొందడం జరిగిందని పేర్కొంది.

Iit

IIT-Kharagpur : ఐఐటీ చరిత్రలో అత్యధిక ప్లేస్ మెంట్ ఆఫర్లను ప్రముఖ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ – ఖరగ్ పూర్ అందుకొంటోంది. 1100 మందికి పైగా..ప్లేస్ మెంట్ ఆఫర్లను అందుకున్నట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది. సంవత్సరానికి రూ.2 నుంచి 2.4 కోట్ల ప్యాకేజీలతో ఇద్దరు రిక్రూటర్లు రెండు పెద్ద ఆఫర్లు చేశారని, ఇప్పటి వరకు తమకు కోటి వేతనంతో 20కి పైగా ఆఫర్లు వచ్చినట్లు కళాశాల పేర్కొంది.

Read More : Farmers In Delhi : తగ్గేదే లే.. కేసులు ఉపసంహరించుకునే వరకు ఉద్యమిస్తామన్న రైతులు

కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతున్నా…ఐఐటీ ఖరగ్ పూర్ ప్రీ ప్లేస్ మెంట్ ఆఫర్లు పొందడం విశేషం. 35 అంతర్జాతీయ ఆఫర్లను పొందడం జరిగిందని యాజమాన్యం తెలిపింది. సందర్శించిన రిక్రూటర్లలో హనీవెల్, ఐబిఎమ్, శామ్ సంగ్, క్వాల్కామ్, అమెరికన్ ఎక్స్ ప్రెస్, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఉబెర్, ఇంటెల్ ఉన్నాయని కళాశాల వెల్లడించింది. డిసెంబర్ 01  నుంచి మూడు రోజుల పాటు ప్లేస్ మెంట్ సెషన్ కొనసాగిందని, బ్యాంకింగ్, ఫైనాన్స్, కన్సల్టింగ్, కోర్ ఇంజనీరింగ్, సాఫ్ట్ వేర్, ఎనలిటిక్స్ అన్ని రంగాలలో 100కి పైగా కంపెనీలు పాల్గొనడం జరిగిందని కళాశాల వెల్లడించింది.