తిత్లీ తుఫాన్ ధాటికి నష్టం నుంచి కోలుకో లేదు. సహాయక చర్యలు పూర్తికానే లేదు. బీభత్సం సృష్టించేందుకు మరో తుఫాన్ సిద్ధమైంది. తూర్పు మధ్య అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం త్వరగా బలపడుతూ.. శనివారం సాయంత్రం నాటికి ప్రభంజనం సృష్టిస్తుందని వాతావరణ శాఖ వెల్లడించింది.
మహారాష్ట్ర తీరంవైపు కదులుతోన్న అల్పపీడనం కారణంగా కర్నాటక, మహారాష్ట్రలకు తుఫాను తీసుకురానుంది. గురువారం నుంచే సూచనలు కనిపిస్తుండటంతో జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉంది.
శుక్రవారం ఉదయానికి మహారాష్ట్రలోని రత్నగిరి ప్రాంతం నుంచి ముంబైకు 240కి.మీ నుంచి 380ల వేగంతో ప్రయాణించనుంది. దీని కారణంగా ఓ ఐదు రోజుల పాటు వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు వెల్లడించారు. దీంతో గంటకు 60 నుంచి 70కిలీమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
అక్టోబర్ 28 నుంచి 31 వరకు ప్రజలు క్యార్ తుఫాను నుంచి అప్రమత్తతతో ఉండాలని వాతావరణశాఖ హెచ్చరించింది. ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఈ ప్రభావంతో కర్నాటక, గోవా తీరప్రాంతాల్లో సాధారణ నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. 24 గంటల్లో సింధుదుర్గ్ జిల్లాకు 204.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణశాఖ పేర్కొంది.