Vehicle Scrappage Policy: ఆ వాహనాలను వినియోగించొద్దు.. ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థిక మంత్రిత్వ శాఖ కీలక ఆదేశాలు

15ఏళ్లు దాటిన వాహనాలపై ఆర్థిక మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగులు అలాంటి వాహనాలను వినియోగించవద్దని సూచించింది.

Vehicle Scrappage Policy

Vehicle Scrappage Policy: 15ఏళ్లు దాటిన వాహనాలపై ఆర్థిక మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగులు అలాంటి వాహనాలను వినియోగించవద్దని సూచించింది. దేశంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు, ప్రయాణీకుల భద్రత, ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు, వాహనాలను స్క్రాప్ చేసే నిబంధనలను పున: పరిశీలించామని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని వ్యయ విభాగం కార్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది.

Vehicle Scrappage Policy : వాహనాల తుక్కు పాలసీ ప్రారంభించిన మోదీ

పాత వాహనాల రిజిస్ట్రేషన్ పునరుద్దరణ విషయంలో రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (రవాణా శాఖ) ముసాయిదాను సిద్ధం చేసింది. ఈ ముసాయిదాలో 2022 ఏప్రిల్ 1 తర్వాత 15సంవత్సరాల వాహనాలను రెన్యూవల్ చేయకూడదని ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. ఇందులో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రపాలిక ప్రాంతాలు, పీఎస్‌యులు, మున్సిపల్ బోర్డు మోదలైన అన్ని రకాల ప్రభుత్వ వాహనాలు ఉన్నాయి. ఈ విషయంపై సమాచారం ఇస్తూ.. రోడ్డు రవాణా శాఖ ఇప్పటికే సోషల్ మీడియా హ్యాండ్స్ ద్వారా ఈ ఆర్డర్ గురించి సమాచారం ఇచ్చింది.

Scrappage Policy: వెహికల్ స్క్రాపేజ్‌ పాలసీ.. 25శాతం రోడ్డు ట్యాక్స్ రద్దు

దేశంలో కాలుష్యం స్థాయిని తగ్గించడానికి, ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకోవడానికి, ప్రభుత్వం 2021-22 ఆర్థిక సంవత్సర బడ్జెట్ లో వాలంటరీ వెహికల్ స్క్రాపింగ్ పాలసీని తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. దీని ద్వారా ఇప్పుడు ఏ ప్రభుత్వ శాఖకూడా 15 సంవత్సరాల కంటే పాత వాహనాన్ని ఉపయోగించకూడదని ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది.