Bharat Jodo Yatra: ద్వేషపూరిత మార్కెట్లో ప్రేమను వ్యాప్తి చేసే దుకాణాలు తెరవండి: రాహుల్

కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు. రాజస్థాన్ లో భారత్ జోడో యాత్రను కొనసాగిస్తున్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ... ‘‘ద్వేషపూరిత మార్కెట్లో ప్రేమను వ్యాప్తి చేస్తే దుకాణాలు తెరవండి’’ అని అన్నారు. తనపై బీజేపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, ద్వేషాన్ని వ్యాపింపజేస్తున్నారని రాహుల్ అన్నారు.

Congress would have defeated BJP in Gujarat if AAP says Rahul Gandhi

Bharat Jodo Yatra: కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు. రాజస్థాన్ లో భారత్ జోడో యాత్రను కొనసాగిస్తున్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ… ‘‘ద్వేషపూరిత మార్కెట్లో ప్రేమను వ్యాప్తి చేసే దుకాణాలు తెరవండి’’ అని అన్నారు. తనపై బీజేపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, ద్వేషాన్ని వ్యాపింపజేస్తున్నారని రాహుల్ అన్నారు.

బీజేపీ కార్యాలయాలపై నిలబడి కొందరు బీజేపీ నేతలు తాను చేస్తున్న భారత్ జోడో యాత్రను చూస్తున్నారని చెప్పారు. తన పాదయాత్రలో భాగంగా ఈ విషయాన్ని గుర్తించానని అన్నారు. వారిపై తాను ద్వేషాన్ని చూపబోనని, తన భావజాలానికి అనుగుణంగా నడుచుకుంటానని చెప్పారు.

తాను ఏం చేస్తున్నానంటూ కొందరు బీజేపీ కార్యకర్తలు అడుగుతున్నారని, కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ఎందుకు పాదయాత్ర చేస్తున్నానని వారి నేతలు అడుగుతున్నారని రాహుల్ చెప్పారు. వారికి తాను ఓ విషయం చెబుతున్నానని.. ద్వేషపూరిత మార్కెట్లో ప్రేమను పంచడానికి తాను ఓ కౌంటర్ ప్రారంభిస్తున్నానని చెప్పారు.

‘‘మీరు నన్ను ద్వేషిస్తారు. తిడతారు.. ఇదే మీరు హృదయం.. మీ మార్కెట్ అంతా ద్వేషంలో నిండి ఉంది.. నేను ప్రారంభించిన దుకాణం మాత్రం ప్రేమను వ్యాప్తి చేయడానికే’’ అని రాహుల్ వ్యాఖ్యానించారు. ద్వేషపూరిత మార్కెట్లో అప్పట్లోనూ మహాత్మా గాంధీ, సర్దార్ పటేల్, జవహర్ లాల్ నెహ్రూ, ఆజాద్ వంటి వారు ప్రేమను పంచే దుకాణాలు తెరిచారని రాహుల్ చెప్పారు.

Google For India 2022 : భారత్‌లో గూగుల్ 8వ ఎడిషన్ ఈవెంట్.. గూగుల్ పే నుంచి డిజీలాకర్ వరకు టాప్ 5 హైలెట్స్ ఇవే..!