Heavy Rains: ఉత్తరాదిని ముంచెత్తిన వాన.. వరదలు, పిడుగులకు యూపీలో 34 మంది మృతి

భారీ వర్షాల కారణంగా రాష్ట్రం గుండా ప్రవహించే గంగ, రామగంగ, యమునా, రప్తి నదుల్లో ఈ పరిస్థితి ప్రమాదకరంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో ఉన్న 75 జిల్లాలో 68 జిల్లాలు వర్ష ప్రభావాన్ని తీవ్రంగా ఎదుర్కొంటున్నాయని ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్‭మెంట్ తెలిపింది.

Uttar Pradesh: ఉత్తర భారతాన్ని భారీ వర్షాలు కుదిపివేస్తున్నాయి. ఊర్లు, పొలాలు, రోడ్లు, అడవులు అన్నీ వరదలో ముంచెత్తుతున్నాయి. ఇక ఈ వర్షాలకు తోడు ఉరుములు, మెరుపులు, పిడుగులు ప్రమాదకరంగా మారాయి. కుండపోత వానకు తోడు పిడుగుపాట్లకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 34 మంది మరణించినట్లు ప్రభుత్వం సోమవారం వెల్లడించింది. ఇందులో 10 మంది గడిచిన 24 గంటల్లో మృతి చెందారట. ఇక మొత్తం మరణాల్లో 17 మంది పిడుగుపాటుకు మృతి చెందగా.. 12 మంది భారీ వరదలకు ప్రాణాలు కోల్పోయారు, ఇక మరో ఐదుగురు కొండ చరియలు విరిగిపడడం వల్ల మరణించారు.

Mahesh babu : కోట్లిచ్చే బ్రాండ్స్‌కి మాత్రమే కాదు.. సేవ కోసం కూడా బ్రాండ్ అంబాసిడర్ గా మహేష్..

కాగా, మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 4 లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. ఇక భారీ వర్షాల కారణంగా గాయాలు ఎదుర్కొన్నవారికి సరైన వైద్యం అందిస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీంతో నదుల్లో నీటి మట్టం భారీ స్థాయికి పెరిగిందట. భారీ వర్షాల కారణంగా రాష్ట్రం గుండా ప్రవహించే గంగ, రామగంగ, యమునా, రప్తి నదుల్లో ఈ పరిస్థితి ప్రమాదకరంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో ఉన్న 75 జిల్లాలో 68 జిల్లాలు వర్ష ప్రభావాన్ని తీవ్రంగా ఎదుర్కొంటున్నాయని ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్‭మెంట్ తెలిపింది.

Karnataka Assembly: కర్ణాటకలో కలకలం.. కత్తితో అసెంబ్లీకి వచ్చిన మహిళ.. తరువాత ఏం జరిగిందంటే?

ఢిల్లీ, హర్యానా, పంజాబ్, రాజస్థాన్, హిమాచల్, ఉత్తరాఖండ్, జమ్మూకాశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపిలేని వర్షం కురుస్తుంది. ఉత్తరాఖండ్, హిమాచల్, పంజాబ్, రాజస్థాన్‌లో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో ఉత్తరాఖండ్, హిమాచల్‌ ప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వంతెనలు, రోడ్లు, రైల్వే ట్రాక్‌లు దెబ్బతిన్నాయి. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. ఢిల్లీలో 41 ఏళ్ల తర్వాత రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. ఢిల్లీ ఎన్సీఆర్‌లో 33 గంటల్లో 258.8 మి.మీ. వర్షపాతం నమోదైంది. వర్షాల ప్రభావంతో ఢిల్లీలో పాఠశాలలు మూసివేశారు. సోమవారం ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అయితే, జులై 15 వరకు భారీ, తేలికపాటి వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆదివారం సాయంత్రం 5:30 వరకు లోధి రోడ్ ప్రాంతంలో గరిష్టంగా 116.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

ట్రెండింగ్ వార్తలు