‘ముస్లింలను కలపండి.. లేదా ఇతర మతస్థులను తీసేయండి’

దేశమంతా కొనసాగుతున్న పౌరసత్వ సవరణ చట్టంపై ఆందోళనల సందర్భంగా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘పౌరసత్వ చట్టంలో మార్పులు తీసుకురావాల్సి ఉంది. ఒకవేళ నరేంద్ర మోడీ ఈ సమస్యకు పరిష్కారం తీసుకోదలచుకుంటే ఇలా చేయాలి. వాళ్లు అందులో ముస్లింల పేర్లు అయినా చేర్చాలి లేదా.. మిగతా మతస్థుల పేర్లు అయినా తొలగించాలి’ అని జంగ్ అన్నారు. 

అన్నా హజారే నాయకత్వంలో ఆందోళన జరుగుతున్నప్పుడు ఢిల్లీ సీఎంను కలిసిన సందర్భాన్ని గుర్తు చేశారు. ‘సామాన్య ప్రజల ఆందోళన జరుగుతుండగా మన్మోహన్ సింగ్ ప్రభుత్వం అరవింద్ కేజ్రీవాల్, అతని సహచరులను కలిసింది. అప్పుడు ప్రతి చోట నుంచి ఆందోళనలు వ్యతిరేకత వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం వీటిపై విద్యార్థులతో చర్చించి నిర్ణయం తీసుకోకపోతే వాళ్లే దేశాన్ని పాలిస్తారు’ అని వెల్లడించారు. 

దీంతో పాటు జంగ్ జేఎన్‌యూ విద్యార్థులపై జరిగిన దాడిని ఖండించారు. ‘ఇందులో ఎవరు ఇన్‌వాల్వ్ అయి ఉన్నారనేది ఇప్పటికీ తెలీదు. ఇటువంటి ఘటనలు చాలా సిగ్గుచేటు. దేశరాజధానిలో ప్రజాస్వామ్యం లేకుండా చేస్తున్న పనులు సిగ్గు చేటు’ అని జనవరి 5న జేఎన్‌యూ విద్యార్థులపై జరిగిన దాడి అందులో 36మందికి గాయాలు అయిన ఘటనను గుర్తు చేశారు.