income tax of Rs.37.5 lakh daily wager
Daily Wager Rs.37.5 Lakh Income Tax : ఒక రోజువారీ కూలీకి రూ.37.5 లక్షల పన్ను చెల్లించాలని ఆదాయపు పన్ను (ఐటీ) నోటీస్ పంపించింది. దీంతో ఆ వ్యక్తి షాక్ అయ్యాడు. వెంటనే పోలీస్ స్టేషన్‌ను వెళ్లి ఫిర్యాదు చేశాడు. ఈ సంఘటన బీహార్‌లోని ఖగారియా జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మఘౌనా గ్రామానికి చెందిన గిరీష్ యాదవ్ కూలీ పనులు చేసుకుని జీవిస్తున్నాడు. అతడు రోజుకు రూ.500 సంపాదిస్తున్నాడు.
అయితే గిరీష్‌కు ఇటీవల ఐటీ నోటీస్ వచ్చింది. రూ.37.5 లక్షల ఆదాయపు పన్ను చెల్లించాలని అందులో ఉంది. అతడి పేరుతో పాన్ నంబర్‌తోపాటు రాజస్థాన్‌కు చెందిన ఒక కంపెనీకి సంబంధించిన వ్యక్తిగా ఆ నోటీస్‌లో పేర్కొన్నారు. రూ.37.5 లక్షల ఆదాయపు పన్ను నోటీస్ అందుకున్న గిరీష్ యాదవ్ కంగారు పడ్డాడు. ఆ నోటీస్ తీసుకుని అలౌలి పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు.
Electricity Bill : నెలకు కరెంట్ బిల్లు రూ.3419 కోట్లు-ఆస్పత్రిలో చేరిన ఇంటి యజమాని
ఢిల్లీలో పని చేసినప్పుడు పాన్ కార్డు కోసం ప్రయత్నించినట్లు తెలిపాడు. అయితే పాన్ కార్డును తాను పొందలేదని చెప్పాడు. ఐటీ నోటీస్‌లో పేర్కొన్న రాజస్థాన్ కంపెనీ గురించి తనకు తెలియదని, తాను ఎప్పుడూ కూడా రాజస్థాన్‌కు వెళ్లలేదంటూ వాపోయాడు. ఆ ఐటీ నోటీస్‌ను పరిశీలించిన పోలీసులు మోసపూరితం కావచ్చని అనుమానించారు. ఫ్రాడ్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.