దేశ ప్రజలకోసం ఆరు గ్యారెంటీలు.. కూటమి ర్యాలీలో కేజ్రీవాల్ సందేశాన్ని వినిపించిన సునీతా కేజ్రీవాల్

ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో నిర్వహిస్తున్న ఇండియా అలయన్స్ సేవ్ డెమోక్రసీ ర్యాలీలో ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ పాల్గొన్నారు.

Arvind Kejriwal wife Sunita Kejriwal

INDIA Alliance Rally : ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో నిర్వహిస్తున్న ఇండియా అలయన్స్ సేవ్ డెమోక్రసీ ర్యాలీలో ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మీ కేజ్రీవాల్ మీకు జైలు నుంచి సందేశాన్ని పంపించారు.. ఈ సందేశాన్ని చదివే ముందు నేను మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకుంటున్నాను. మన ప్రధాని నరేంద్ర మోదీ నా భర్తను జైల్లో పెట్టారు. ప్రధానమంత్రి చేసింది సరైనదేనా? కేజ్రీవాల్ నిజమైన దేశభక్తుడు, నిజాయితీ పరుడని మీరు నమ్ముతున్నారా? అంటూ ఆమె సభలో పాల్గొన్న వారిని ప్రశ్నించారు. కేజ్రీవాల్ రాజీనామా చేయాలని బీజేపీ వాళ్లు అంటున్నారు.. మీ కేజ్రీవాల్ సింహం. కోట్లాది ప్రజల హృదయాల్లో ఆయన ఉన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో పోరాడుతూ అమరుడయ్యాడని, మళ్లీ ఈ జన్మలో కూడా కేజ్రీవాల్ ను భారతమాత కోసం పోరాడేందుకు దేవుడు పంపాడని నాకు కొన్నిసార్లు అనిపిస్తుందంటూ సునీతా కేజ్రీవాల్ పేర్కొన్నారు.

Also Read : Arvind Kejriwal : కోర్టులో కేజ్రీవాల్‌కి దక్కని ఊరట.. స్వయంగా వాదనలు వినిపించిన సీఎం

కేజ్రీవాల్ సందేశాన్నిసునీతా కేజ్రీవాల్ చదివి వినిపించారు. నేను ఓట్లు అడగడం లేదు.. ఎవరిని గెలిపించమని, ఓడించమని కోరడం లేదు. నూతన భారతాన్ని నిర్మించుకోవాలి. జైలులో దేశం గురించి ఆలోచించడానికి చాలా సమయం ఉంది. భారత మాత బాధలో ఉంది. దేవుడు భారత్ కు అన్ని ఇచ్చాడు.. అయినా దేశంలో అభివృద్ధి లేదు. పేదరికంలో ఉన్నాం.. బీజేపీ తమ మిత్రులతో కలిసి దేశాన్ని దోచుకుంటుంది అంటూ కేజ్రీవాల్ సందేశాన్ని ఆయన సతీమణి సునీతా వినిపించారు.

Also Read : Arvind Kejriwal : జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపడాన్ని అడ్డుకోలేం.. స్పష్టం చేసిన ఢిల్లీ హైకోర్టు

ఈడీ కస్టడీ నుంచి దేశ ప్రజలకోసం ఆరు గ్యారెంటీలు కేజ్రీవాల్ ప్రకటించాడని సునీతా కేజ్రీవాల్ అన్నారు. అవేమిటంటే.. దేశవ్యాప్తంగా 24 గంటలపాటు కరెంట్. ప్రతి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలు, ఉచిత విద్య కల్పిస్తాం. ప్రతి గ్రామంలో మోహల్లా క్లినిక్స్, జిల్లాల్లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు చేస్తాం. రైతులకు స్వామినాథన్ కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా పంటలకు మద్దతు ధర కల్పిస్తాం. ఢిల్లీకి రాష్ట్ర హోదా, పూర్తి అధికారాలు కల్పిస్తామని కేజ్రీవాల్ తన సందేశంలో పేర్కొన్నారు. అయితే, ఇండియా కూటమి నేతలను కేజ్రీవాల్ క్షమించమని కోరారు.. ఎందుకంటే.. నేను జైల్లో ఉన్నాను కాబట్టి మిమ్మల్ని అడగకుండా హామీల ప్రకటన చేస్తున్నాని కేజ్రీవాల్ తన సందేశంలో పేర్కొన్నారు.

 

 

ట్రెండింగ్ వార్తలు