India bound cargo ship hijacked : ఇండియా వస్తున్న కార్గో షిప్ హైజాక్… హౌతీ మిలిటెంట్ల ఉగ్రవాద చర్య

భారతదేశానికి వెళుతున్న కార్గో షిప్ ను హౌతీ మిలిటెంట్లు హెలికాప్టర్ సాయంతో హైజాక్ చేశారు. యెమెన్‌ దేశానికి చెందిన హౌతీ మిలీషియా దక్షిణ ఎర్ర సముద్రంలో భారత్‌కు చెందిన అంతర్జాతీయ కార్గో షిప్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఇజ్రాయెల్ తెలిపింది....

India bound cargo ship

India cargo ship hijacked : భారతదేశానికి వెళుతున్న కార్గో షిప్ ను హౌతీ మిలిటెంట్లు హెలికాప్టర్ సాయంతో హైజాక్ చేశారు. యెమెన్‌ దేశానికి చెందిన హౌతీ మిలీషియా దక్షిణ ఎర్ర సముద్రంలో భారత్‌కు చెందిన అంతర్జాతీయ కార్గో షిప్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఇజ్రాయెల్ తెలిపింది. భారత్ కార్గో షిప్ హైజాక్ చేయడం ఇరానియన్ ఉగ్రవాద చర్య అని ఇజ్రాయెల్ పేర్కొంది. హైజాక్ అయిన ఓడలో ఓడలో ఇజ్రాయెల్ పౌరులు ఎవరూ లేరని అధికారులు తెలిపారు.

ALSO READ : Telangana Assembly Election 2023 : తెలంగాణలో ఇంటి వద్దే ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం

దక్షిణ ఎర్ర సముద్రం నుండి నౌకను యెమెన్ నౌకాశ్రయానికి తీసుకువెళ్లినట్లు బృందం తెలిపింది. హౌతీలు హెలికాప్టర్‌ను ఉపయోగించి ఓడపై ఫైటర్‌లను దించడం ద్వారా హైజాక్ చేశారు. ఈ కార్గో షిప్ బ్రిటీష్ కంపెనీకి చెందినదని, దీనిని జపాన్ కంపెనీ నిర్వహిస్తోందని టెల్ అవీవ్ తెలిపింది. నౌకలో ఉక్రేనియన్, బల్గేరియన్, ఫిలిప్పీన్స్, మెక్సికన్ సహా వివిధ దేశాలకు చెందిన 25 మంది సిబ్బంది ఉన్నారు.

ALSO READ : Leopard : జనవాసాల్లోకి వస్తున్న చిరుతపులులు… మళ్లీ బెడ్రూంలోకి వచ్చిన చిరుతపులి

ఈ నౌకలో భారతీయులు ఎవరూ లేరని ఇజ్రాయెల్ తెలిపింది. తుర్కియే నుంచి భారత్ వస్తున్న ఈ నౌకను మిలిటెంట్లు హైజాక్ చేశారని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కార్యాలయం వెల్లడించింది. ఇలాంటి ఘటనలు అంతర్జాతీయ అంతర్జాతీయ సంక్షోభానికి దారితీస్తాయని ఇజ్రాయెల్ పేర్కొంది.