World’s Highest Road : ప్రపంచంలోనే ఎత్తైన రోడ్డుని నిర్మించిన BRO

ప్రపంచంలోని ఎత్తైన రహదారిని తూర్పు లడఖ్‌లో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్(BRO)నిర్మించిందని కేంద్ర ప్రభుత్వం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.

World’s Highest Road ప్రపంచంలోని ఎత్తైన రహదారిని తూర్పు లడఖ్‌లో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్(BRO)నిర్మించిందని కేంద్ర ప్రభుత్వం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఉమ్లింగ్లా పాస్ వద్ద 19,300 అడుగుల ఎత్తులో ఈ నిర్మించబడిందని తెలిపింది. కాగా,ఇప్పటివరకు బొలీవియాలోనే అత్యంత ఎత్తైన రహదారి(18,953 అడుగులు) ఉండగా,ఆ రికార్డుని భారత్ బ్రేక్ చేసింది.

52 కి.మీ పొడవైన మరియు ప్రపంచంలోనే ఎత్తైన రోడ్డుని ఉమ్లింగా పాస్ గుండా బీఆర్ వో నిర్మించిందని.. ఎవరెస్ట్ శిఖరం బేస్ క్యాంప్‌ లు(పాల్‌లోని దక్షిణ బేస్ క్యాంప్ 17,598 అడుగుల ఎత్తు, టిబెట్‌లో ఉత్తర బేస్ క్యాంప్ 16,900 అడుగుల ఎత్తు)కంటే ఎత్తులో ఈ రోడ్డు నిర్మించబడినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. మరో రకాంగా చెప్పాలంటే, చాలావరకు పెద్ద వాణిజ్య విమానాలు 30,000 అడుగుల ఎత్తున ఎగురుతాయి. కాబట్టి ఈ రహదారి దానిలో సగానికి పైగా ఎత్తులో ఉంది.

లడఖ్ వంటి కఠినమైన భూభాగంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి చాలా పెద్ద సవాల్. శీతాకాలంలో, ఉష్ణోగ్రత మైనస్ 40 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోతుంది మరియు ఈ ఎత్తులో ఆక్సిజన్ స్థాయి సాధారణ ప్రదేశాల కంటే దాదాపు 50 శాతం తక్కువగా ఉంటుంది. అయితే బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్.. ప్రమాదకరమైన భూభాగంలో మరియు విపరీతమైన వాతావరణ పరిస్థితులలో పనిచేసే బీఆర్ వో సిబ్బంది కఠినశ్రమ,మొండి పట్లుదల కారణంగా ఈ ఘనతను సాధించిందని ప్రభుత్వం తన ప్రకటనలో తెలిపింది. ఉమ్లింగ్లా పాస్ ఇప్పుడు..లడఖ్‌లో పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి, సామాజిక-ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి బ్లాక్ టాప్ రోడ్‌తో అనుసంధానించబడిందని ప్రభుత్వం తెలిపింది.

ట్రెండింగ్ వార్తలు