India-China Disengage In Gogra : భారత్ పట్టుతో వెనక్కి తగ్గిన చైనా..గోగ్రాలో దళాల ఉపసంహరణ

తూర్పు లడఖ్ లోని గోగ్రా ప్రాంతం నుంచి ద‌ళాల ఉప‌సంహ‌రణకు భారత్-చైనా అంగీకరించినట్లు శుక్రవారం కేంద్రప్రభుత్వం తెలిపింది.

India-China Disengage In Gogra తూర్పు లడఖ్ లోని గోగ్రా ప్రాంతం నుంచి ద‌ళాల ఉప‌సంహ‌రణకు భారత్-చైనా అంగీకరించినట్లు శుక్రవారం కేంద్రప్రభుత్వం తెలిపింది. అదేవిధంగా గతేడాది సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్న సమయం నుంచి గోగ్రాలో ఏర్పాటు చేసిన తాత్కాలిక టెంట్ల‌ను కూడా రెండు దేశాల సైనికులు తొల‌గించిన‌ట్లు కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. ఆగ‌స్టు 4, 5 తేదీల్లో ఇరు దేశాల ద‌ళాలు శాశ్వ‌త ప్రాంతాల‌కు వెళ్లినట్లు ప్రకటనలో తెలిపింది. దీంతో అక్క‌డ లైన్ ఆఫ్ కంట్రోల్ పునరుద్దరణకి క‌ట్టుబ‌డి ఉన్న‌ట్లు తెలిపింది. ఎల్ఏసీ వెంట‌.. భార‌తీయ ఆర్మీ, ఐటీబీపీ ద‌ళాలు శాంతికి క‌ట్టుబ‌డి ఉంటాయ‌ని ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు

కాగా,గత శనివారం చూసుల్ మోల్డోలో భారత్-చైనా మధ్య 12 వ రౌండ్ మిలటరీ చర్చలు జరిగిన విషయం తెలిసిందే. అక్క‌డ కుదిరిన ఒప్పందం ప్ర‌కారం.. గోగ్రాలో ఉన్న తాత్కాలిక టెంట్ల‌ను రెండు దేశాల సైనికులు తొల‌గించిన‌ట్లు తెలుస్తోంది. బోర్డర్ లో సైనిక ప్రతిష్ఠంభణ పరిష్కారంలో పురోగతి కన్పించినట్లు ఇవాళ్టి ప్రకటనలో ప్రభుత్వం తెలిపింది. మరోవైపు, 2 ఘర్షణ ప్రాంతాలు..హాట్ స్ప్రింగ్స్,దెస్పాంగ్ ఏరియాల్లో సైనిక ప్రతిష్ఠంభణ కొనసాగుతూనే ఉంది.

READ : India-China Military Talks : సరిహద్దుల్లో శాంతి, ప్రశాంతత..భారత్-చైనా అంగీకారం

ట్రెండింగ్ వార్తలు