India Covid Updates India Logs Over 10,000 New Covid Cases After 33 Days
India Covid Updates : దేశవ్యాప్తంగా కరోనా కొత్త కేసుల సంఖ్య పెరుగుతోంది. రోజురోజుకీ కరోనా బారినపడేవారి సంఖ్య పెరుగుతూ పోతోంది. ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తోంది. కొత్త వేరియంట్ తీవ్రత తక్కువగానే ఉన్నప్పటికీ కేసుల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. నవంబర్ 26 తర్వాత దేశంలో కోవిడ్ కేసులు భారీగా పెరిగాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. 33 రోజుల తర్వాత దేశవ్యాప్తంగా కొత్తగా కరోనా యాక్టివ్ కేసులు 10వేలకు చేరాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఒమిక్రాన్ వ్యాప్తితో పాటు పెరుగుతున్న కేసుల దృష్ట్యా.. దేశ ప్రజలంతా మరింత అప్రమత్తంగా ఉండాలని కేంద్రం విజ్ఞప్తి చేసింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ ఢిల్లీలో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భారత్‌లో గత వారం రోజుకు 8వేల కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. కోవిడ్ కేసుల పాజిటివిటి రేటు దాదాపు 0.92శాతంగా నమోదైంది.
The weekly positivity rate of more than 10% is being noted in 8 districts including 6 districts from Mizoram, one from Arunachal Pradesh, Kolkata in West Bengal. The weekly case positivity rate is between 5-10% in 14 districts: Luv Aggarwal, Joint Secretary, Union Health Ministry pic.twitter.com/SvpSEFN1wg
— ANI (@ANI) December 30, 2021
8 జిల్లాల్లో వారానికోసారి 10 శాతం కన్నా ఎక్కువ పాజిటివిటీ రేట్లను నమోదయ్యాయి. మిజోరంలో 6 కొత్త కేసులు, అరుణాచల్ ప్రదేశ్‌లో ఒకటి, బెంగాల్‌లో ఒకటి చొప్పున కరోనా కేసులు నమోదయ్యాయి. 14 జిల్లాల్లో 5శాతం నుంచి 10శాతం మధ్య పాజిటివిటీ రేటు నమోదయ్యాయి. ఇక కోల్‌కతాలో కోవిడ్ పాజిటివిటీ రేటు 12.5శాతంగా నమోదైంది. కరోనా కేసుల నియంత్రణకు అవసరమైన చర్యలు చేపట్టేందుకు అన్ని రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు కేంద్రం మంత్రిత్వ శాఖ తెలిపింది.
ముంబై, పూణే, థానే, బెంగళూరు, చెన్నై, ముంబై ఉప పట్టణాలైన గురుగ్రామ్‌లలో కోవిడ్ కేసుల పెరుగుదల భారీగా నమోదవుతున్నాయి. భారతదేశంలో ఒక్క గురువారమే 13,154 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 82,402కు చేరగా.. కరోనా మరణాల సంఖ్య 4,80,860కి పెరిగింది. మరోవైపు.. ఒమిక్రాన్ కేసుల సంఖ్య 961గా నమోదు కాగా.. ఢిల్లీలో 263 కేసులు, మహారాష్ట్రలో 252 కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్ 961 కేసుల్లో 320 మంది బాధితులు కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.
There are 961 cases of #Omicron variant of coronavirus in India, out of which 320 patients have recovered: Luv Aggarwal, Joint Secretary, Union Health Ministry pic.twitter.com/0km2lpLfv0
— ANI (@ANI) December 30, 2021
బుధవారం కంటే ఈ రోజున 42శాతం అధికంగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. అలాగే 7 నెలల తర్వాత దేశ రాజధానిలో అధిక కేసులు నమోదు కావడం ఇదే… మే 26న ఢిల్లీలో 1.93 శాతం పాజిటివ్ రేటుతో 1,491 కేసులు నమోదయ్యాయి. 130 మంది కరోనాతో మరణించారు. జాతీయ రాజధానిలో బుధవారం ఒక్కరోజే 923 కరోనావైరస్ కేసులను నమోదయ్యాయి. నిన్నటి నుంచి భారీగా 86 శాతం కరోనా కేసులు ఒక్కసారిగా భారీగా పెరిగిపోయాయి. మే 30 నుంచి అత్యధికంగా నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 1.73 శాతంగా కరోనా పాజిటివిటీ రేటు నమోదైంది. ఢిల్లీలో మొత్తంగా 14,46, 415 కరోనా కేసులు నమోదు కాగా.. 25,107 మంది కరోనాతో మరణించారు. ప్రస్తుతం ఢిల్లీలో 3081 కరోనా యాక్టివ్ కేసులు ఉండగా.. ఢిల్లీ వ్యాప్తంగా 645 కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేసినట్టు ప్రభుత్వం తెలిపింది. కరోనా కేసులు పెరగడంతో ఢిల్లీ ప్రభుత్వం విధించిన కొవిడ్ ఎల్లో అలర్ట్ ఆంక్షలు కొనసాగుతున్నాయి.
Read Also : Mumbai On High Alert : ఉగ్రదాడికి స్కెచ్..ముంబై హై అలర్ట్