Akash missile system: ఇలాంటి ఘనత సాధించిన మొట్టమొదటి దేశంగా భారత్.. మన క్షిపణి లక్ష్యాన్ని ఎలా ఛేదించిందో చూడండి..

సింగిల్ ఫైరింగ్ యూనిట్‌తో కమాండ్ గైడెన్స్ ద్వారా ఏకకాలంలో ఆకాశ్ ఇలాంటి లక్ష్యాలను ఛేదించడంతో..

Akash missile system

Akash missile system: ఆకాశ్ క్షిపణి వ్యవస్థ సామర్థ్యాన్ని భారత్ మరోసారి పరీక్షించింది. 25 కిలోమీటర్ల దూరం చొప్పున ఉన్న నాలుగు గగనతల లక్ష్యాలను ఏకకాలంలో ఆకాశ్ ఛేదించిందని రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ-డీఆర్డీవో ప్రకటించింది.

సింగిల్ ఫైరింగ్ యూనిట్‌తో కమాండ్ గైడెన్స్ ద్వారా ఏకకాలంలో ఆకాశ్ ఇలాంటి లక్ష్యాలను ఛేదించడంతో.. ఇటువంటి ఘనత సాధించిన మొట్టమొదటి దేశంగా భారత్ నిలిచిందని డీఆర్డీవో తెలిపింది. ఆకాశ్ ఆయుధ వ్యవస్థను వాడుతూ భారత వాయుసేన ఈ ప్రయోగాన్ని చేసిందని వివరించింది.

ఆకాశ్ ఆయుధ వ్యవస్థను డీఆర్డీవో డిజైన్ చేసి, అభివృద్ధి చేసింది. బీఈఎల్/బీడీఎల్ తో పాటు పలు పరిశ్రమలు ఉత్తత్తి చేశాయి. ఆకాశ్ క్షిపణి వ్యవస్థ సామర్థ్యాన్ని పరీక్షకు సంబంధించిన వీడియోను డీఆర్డీవో తమ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇప్పటికే డీఆర్డీవో మిలటరీకి చెందిన అనేక ప్రాజెక్టుల్లో పాలుపంచుకుంది. భారత్ స్వదేశీ ఆయుధ వ్యవస్థపై దృష్టి పెట్టింది.