Breaking News : 73 రోజుల్లో..ఇండియాకి కరోనా వ్యాక్సిన్

  • Publish Date - August 23, 2020 / 10:25 AM IST

భారతదేశంలో మరో 73 రోజుల్లో కరోనా వ్యాక్సిన్ రాబోతుందా ? అంటే ఎస్ అనే సమాధానాలు వినపడుతున్నాయి. ఈ మేరకు సీరమ్ ఇనిస్టిట్యూట్ శుభవార్త వెల్లడించింది. 58 రోజుల్లో వ్యాక్సిన్ కోవిషీల్డ్ ట్రయల్ ప్రక్రియ ఆఖరి దశలో ఉందని తెలిపింది.

ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ, ఆస్త్రా జెనెకా ఫార్మా కంపెనీలు సంయుక్తంగా వ్యాక్సిన్ ను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ప్రయోగాల్లో కోవిషీల్డ్ వ్యాక్సిన్ చాలా బాగా పని చేస్తుందని టాక్ వినిపిస్తోంది.

కరోనా వ్యాక్సిన్ తయారీ సీరమ్ ఇనిస్టిట్యూట్ కు దక్కింది. మరో 73 రోజుల్లో వ్యాక్సిన్ ను మార్కెట్ లోకి తీసుకొస్తామని సంస్థ టాప్ అధికారి వెల్లడించారు. కోవిషీల్డ్ వ్యాక్సిన్ తయారీలో సీరమ్ వేగంగా పని చేస్తోంది. ఇప్పటికే డోస్ లను కూడా ఇచ్చేస్తున్నారు. మూడో దశ ట్రయల్స్… పుణె, ముంబై, గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరుగుతున్నాయి.

ఒక్కో డోస్ కు కొన్ని రోజుల గడువు విధించుకున్నారు. 2020, ఆగస్టు 22వ తేదీ శనివారం 1600 మందికి ఈ వ్యాక్సిన్ డోస్ ఇచ్చారు. సెకండ్ డోస్ 29 రోజుల తర్వాత ఇస్తారు. డోస్ తీసుకున్న రోగులను నిరంతరం పర్యవేక్షిస్తుంటారు. వారిలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా, రోగ నిరోధక శక్తి అధికంగా ఉండి..కరోనా నుంచి బయటపడితే..ఈ వ్యాక్సిన్ సక్సెస్ అయినట్లేనని అంటున్నారు నిపుణులు.

థర్డ్ ఫేజ్ ఫలితాల రిపోర్టు రావడానికి 15 రోజుల టైం పడుతుందని అంచనా వేసుకుంటున్నారు. 73వ రోజున వ్యాక్సిన్ ఉత్పత్తి స్టార్ట్ చేస్తారని, అదే రోజు భారత్ లో వ్యాక్సిన్ అమ్మకాలు చేపడుతారని అంచనా వేస్తున్నారు.

దేశంలో తయారు చేస్తున్న మొదటి కరోనా వ్యాక్సిన్ డిసెంబర్ నెలఖరు వరకు వస్తుందని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్దన్ ఇప్పటికే మీడియాకు వెల్లడించిన సంగతి తెలిసిందే.

దేశీయంగా తయారవుతున్న ఓ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ భాగంగా మూడో ఫేజ్ లో ఉందన్నారు. ఏడాది చివరి నాటికి అందుబాటులోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారాయన.
భారత్‌కు చెందిన సుమారు 6 సంస్థలు వ్యాక్సిన్ అభివృద్ధి చేసే పనిలో ఉన్నాయి. మూడు వ్యాక్సిన్ రూపొందిస్తున్నాయి.

AstraZeneca : Oxford University, Serum Institute of India (SII), Pune, సంయుక్తంగా (ChAdOx1) తయారు చేసున్నాయి. Bharat Biotech’s Covaxin, Indian Council of Medical Research సంయుక్తంగా, ZycovD by Zydus Cadila లు వ్యాక్సిన్ రూపొందించాయి.

 

ట్రెండింగ్ వార్తలు