100 Crore Covid Doses : భారత్ 100 కోట్ల కరోనా వ్యాక్సిన్లు వేసిన ఘనత

కరోనా వ్యాక్సిన్లు వేయటంలో భారత్ మరో మైలురాయిని అధిగమించింది. 100 కోట్ల వ్యాక్సిన్ డోసులు పూర్తి చేసుకుంది.

Completed 100 Crore Covid Doses: కరోనా వచ్చినా మరణాలను నియంత్రించటంలో కాస్త తడబడినా.. వ్యాక్సిన్లు వేయటంలో మాత్రం భారత్ ముందుంది. యుద్ధ ప్రాతిపదిక కరోనా వ్యాక్సిన్లు వేయటంలో భారత్ మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. కోవిడ్‌ వ్యాక్సినేషన్‌లో దూసుకుపోతున్న భారత్ మరో మైలురాయిని అధిగమించింది. గురువారం నాటికి (అక్టోబర్ 20,2021)100 కోట్లు దాటింది. భారత్ సాధించిన ఈ ఘనతను ప్రపంచానికి చాటి చెప్పేందుకు కేంద్రం రెడీ అవుతోంది. కరోనాను కంట్రోల్‌ చేయడానికి ఉన్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్. అందుకే టీకాలు వేయడంపై భారత ప్రభుత్వం దృష్టిసారించింది. వ్యాక్సినేషన్‌లో రోజుకో రికార్డు క్రియేట్‌ చేస్తూ దూసుకెళ్తోంది. ఎంతగా అంటే..అభివృద్ధి చెందిన 7 దేశాలు అన్నీ కలిపి ఒక నెలలలో ఎన్ని టీకాలు ఇచ్చాయో, వాటికన్నా ఎక్కువ డోసులు భారతదేశంలో వేయటం విశేషం.

Read more : Covid Vaccination:వ్యాక్సినేషన్‌లో భారత్ రికార్డు.. ఒకేరోజులో 86.29 లక్షల డోసులు

దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్‌.. డోసుల సంఖ్య అక్టోబరు 21.. నాటికి 100 కోట్లు పూర్తి అయ్యింది. వ్యాక్సిన్లు వేయటానికి వెళ్లే దారిలేని అత్యంత మారుమూల ప్రాంతాలకు కూడా వ్యాక్సిన్ల తరలించి అక్కడి ప్రజలకు వ్యాక్సిన్లు వేసిన ఘతన భారత్ కే సొంతమని చెప్పటంలో ఏమాత్రం సందేహించనక్కరలేదు. మారుమూల ప్రాంతాలవారు చాలామంది వ్యాక్సిన్లు వేయించుకోవటానికి ఆసక్తి చూపించనవారికి..అవగాహన లేక మూఢత్వంతో వెనుకాడేవారికి కూడా పలు విధాలుగా వైద్య అధికారులు కౌన్సిలింగ్ ఇచ్చి మరీ వ్యాక్సిన్లు వేశారు. భారత్ ఈరోజున కరోనా వ్యాక్సిన్లు వేయటంలో 100 కోట్లను మైలురాయిని దాటింది అంటే దాంట్లో వైద్య సిబ్బంది పాత్ర కీలకమని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు.

ఇటువంటి అరుదైన ఘనతను సాధించిన భారత్ దీన్ని అందరికి చాటి చెప్పటానికి అన్ని ఏర్పాట్లు చేస్తోంది. రైళ్లు, మెట్రో రైళ్లు, విమానాల్లో, ఓడలు వంటి అన్ని ప్రయాణ సాధనాల్లోను 100 కోట్ల డోసుల వ్యాక్సినేషన్‌ విజయాన్ని లౌడ్‌ స్పీకర్ల ద్వారా ప్రకటించాలని సర్కారు డిసైడ్‌ అయ్యింది. అలాగే ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జాతీయ పతాకాన్ని ఎగురవేయనున్నారు.

Read more : వందకోట్ల టీకా డోసులు.. బీజేపీ ప్రచారం

కాగా దేశంలో వ్యాక్సినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్న క్రమంలో మరోపక్క కరోనా కేసులు పెరుగుతు..తగ్గుతు రోజు విధంగా కొనసాగుతు..కొత్తగా 18,454 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 160 మరణాలు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో 1,78,831 యక్టీవ్ కేసులుండగా..0.52 శాతంగా ఉన్న యాక్టివ్ కేసులున్నాయి.దేశంలో ఇప్పటివరకు 3,41,27,450 కేసులు,4,52,811 మరణాలు నమోదయ్యాయి.98.15 శాతంగా ఉన్న కరోన రికవరీ రేటు బుధవారం నాటికి (అక్టోబర్ 20,2021) కరోనా నుంచి కోలుకున్న 17,561 మంది ఉన్నారు. ఇప్పటి వరకు 3,34,95,808 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

ట్రెండింగ్ వార్తలు