India Covid-19 Update : దేశంలో కొత్తగా 10,273 కోవిడ్ కేసులు నమోదు
దేశంలో నిన్న కొత్తగా 10,273 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్య మొన్నటి కంటే 10 శాతం తక్కువ. దీంతో దేశంలో నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 4,29,16,117కి చేరింది.
- chvmurthy
- Published On : February 27, 2022 / 10:35 AM IST
india covid update
India Covid-19 Update : దేశంలో నిన్న కొత్తగా 10,273 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్య మొన్నటి కంటే 10 శాతం తక్కువ. దీంతో దేశంలో నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 4,29,16,117కి చేరింది. ప్రస్తుతం దేశంలో 1,11,472 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
నిన్న కోవిడ్ తదితర కారణాలతో 243 మంది మరణించారు, దీంతో కోవిడ్ వల్ల మరణించినవారి సంక్య 5,13,724కి చేరింది.. జాతీయ కోవిడ్ రికవరీ రేటు 98.54 శాతానికి మెరుగు పడిందిన ఈ రోజు ఉదయం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన బులెటిన్ లో పేర్కోంది.
