Covid Cases Up Date
Covid-19 : దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,226 కోవిడ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 14,955 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో ఇప్పటి వరకు 4,31,36,371 కేసులు నమోదు కాగా 5,24,413 మరణాలు సంభవించాయి. దేశంలో కరోనా రికవరీ రేటు 98.75 శాతంగా ఉంది. నిన్న కరోనా నుంచి 2,202 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,25,97,003 మంది గా నమోదయ్యింది.