New Covid Cases : దేశంలో 88 రోజుల కనిష్ఠ స్థాయికి కోవిడ్ కేసులు

దేశంలో కోవిడ్ కేసులు క్రమంగా త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. 88 రోజుల క‌నిష్ఠ స్థాయిలో కొత్త క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి.

India

New Covid Cases దేశంలో కోవిడ్ కేసులు క్రమంగా త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. 88 రోజుల క‌నిష్ఠ స్థాయిలో కొత్త క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 53,256 క‌రోనా కేసులు,1422 మరణాలు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం ప్ర‌క‌టించింది. గడిచిన 24గంటల్లో 78,190 మంది కోలుకొని హాస్పిటల్స్ నుంచి డిశ్చార్జ్ అయినట్లు తెలిపింది. ప్రస్తుతం దేశంలో 7,02,887 యాక్టివ్ కేసులున్నట్లు పేర్కొంది,

ఇప్పటివరకు దేశవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,99,35,221గా ఉండగా..మరణాల సంఖ్య 3,88,135గా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 2,88,44,199కి చేరిందని తెలిపింది. ఇక,ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 28,00,36,898మందికి కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చినట్లు తెలిపింది. దేశంలో నిన్నటి వరకు మొత్తం 39,24,07,782 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. గత 24గంటల్లో 13,88,699 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

కాగా,భారత్ లో గతేడాది ఆగస్టు-7న కోవిడ్ కేసుల సంఖ్య 20 లక్షల మార్క్ దాటగా..ఆగస్టు-23న 30లక్షల మార్క్.. సెప్టెంబర్-5న 40లక్షల మార్క్..సెప్టెంబర్-16న 50లక్షల మార్క్..పెస్టెంబర్-28న 60లక్షల మార్క్..అక్టోబర్-11న 70లక్షల మార్క్..అక్టోబర్-29న 80లక్షల మార్క్,నవంబర్-20న 90లక్షల మార్క్,డిసెంబర్-19 1 కోటి మార్క్ దాటిన విషయం తెలిసిందే. మే-4,2021న కోవిడ్ కేసుల సంఖ్య దేశంలో 2కోట్లు దాటిన విషయం తెలిసిందే.