India Vaccine Shortage : వచ్చే మూడు నెలల్లో భారత్ వ్యాక్సిన్ తీవ్ర కొరత తప్పదు!

దేశంలో మూడో దశ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఆయా రాష్ట్రాల్లో వ్యాక్సిన్ కొరత వెంటాడుతోంది. భారత్ వచ్చే కొన్ని రెండు నుంచి మూడు నెలల్లో కరోనా వ్యాక్సిన్ తీవ్ర కొరతను ఎదుర్కొనే అవకాశం ఉందని సీరమ్ సీఈఓ అదార్ పూనావాలా బాంబు పేల్చారు.

India May Face Vaccine Shortage : దేశంలో మూడో దశ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఆయా రాష్ట్రాల్లో వ్యాక్సిన్ కొరత వెంటాడుతోంది. భారత్ వచ్చే కొన్ని రెండు నుంచి మూడు నెలల్లో కరోనా వ్యాక్సిన్ తీవ్ర కొరతను ఎదుర్కొనే అవకాశం ఉందని సీరమ్ సీఈఓ అదార్ పూనావాలా బాంబు పేల్చారు. రాబోయే రోజుల్లో వ్యాక్సిన్ సామర్థ్యం, కొరతపై ముందుగానే ఆయన అంచనా వేశారు. వచ్చే జూలై నాటికి 100 మిలియన్ల డోసులు మాత్రమే పెంచగలమని అన్నారు.

ప్రస్తుతం 60 నుంచి 70 మిలియన్ల వ్యాక్సిన్ సామర్థ్యాన్ని మాత్రమే కలిగి ఉన్నామని చెప్పారు. జూలై నాటికి వంద మిలియన్ల కెపాసిటీ కలిగి ఉంటామని భావిస్తున్నట్టు తెలిపారు. ఆర్డర్లు లేనందున డోసుల సామర్థ్యాన్ని పెంచలేదని చెప్పారు. జూలై వరకు వ్యాక్సిన్ కొరత ఉంటుందని పూనావాలా హెచ్చరించారు. ఇంత పెద్దమొత్తంలో వ్యాక్సిన్ ఉత్పత్తి చేయాల్సి వస్తుందని ఊహించలేదని అన్నారు.

వ్యాక్సిన్లు ఆర్డర్లు లేనప్పుడు ఏడాదికి ఒక బిలియన్ డోసులు కంటే ఎక్కువ అవసరం పడదని భావిస్తున్నామని తెలిపారు. జనవరి నెలలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుందని అధికారులు ఊహించలేదన్నారు. వ్యాక్సిన్ల ఆర్డర్ల సామర్థ్యాన్ని విస్తరించేందుకు గత నెలలో సీరమ్ కు కేంద్రం రూ.3వేల కోట్లు అడ్వాన్స్ ఇచ్చిందన్నారు.

ట్రెండింగ్ వార్తలు