భారత్ లో కరోనా మూడో దశ రాబోతుంది..సంపూర్ణ లాక్ డౌనే ఏకైక మార్గం

కరోనా రెండో దశ విజృంభణతో భారతదేశం ఉక్కిరిబిక్కిరవుతోంది.

India కరోనా రెండో దశ విజృంభణతో భారతదేశం ఉక్కిరిబిక్కిరవుతోంది. రోజూ లక్షల సంఖ్యలో కొత్త కేసులు,వేల సంఖ్య మరణాలతో భారత్ తల్లడిల్లుతోంది. అయితే కరోనా మహమ్మారి వ్యాప్తి నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు ఏమాత్రం ఫలించడం లేదు. ఇదే విషయాన్ని ఢిల్లీ ఆల్‌ ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా తెలిపారు.

మంగళవారం ఇండియా టుడే ఇంటర్వ్యూలో గులేరియా మాట్లాడుతూ..ప్రస్తుత కట్టడి చర్యలు కరోనాను ఏమాత్రం నియంత్రించలేవన్నారు. నైట్ కర్ఫ్యూ, వారాంతపు లాక్‌డౌన్‌తో ఎలాంటి ప్రయోజనం లేదని రణ్‌దీప్‌ గులేరియా తెలిపారు. కరోనా కట్టడికి.. సంపూర్ణ లాక్‌డౌనే ఏకైక పరిష్కారం అని స్పష్టం చేశారు. కరోనా కేసులు తగ్గేందుకు సంపూర్ణ లాక్‌డౌనే ఉత్తమ మార్గమని పునరుద్ఘాటించారు. కనీసం రెండు వారాలైనా సంపూర్ణ లాక్‌డౌన్‌ ప్రకటించాలన్నారు. కొన్ని ప్రాంతాలకే లాక్‌డౌన్‌ పరిమితమైతే అమెరికా మాదిరి మన దేశంలో పరిస్థితి ఉంటుందన్నారు. లాక్‌డౌన్‌ లాంటి నిర్ణయం తీసుకుంటూనే ప్రజలకు నిత్యావసరాలతో పాటు రోజువారీ కార్మికుల గురించి కూడా ఆలోచన చేయాలన్నారు.

కరోనా మూడో వేవ్‌కు సిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా ణ్‌దీప్‌ గులేరియా అప్రమత్తం చేశారు. కరోనా కట్టడికి మూడు మార్గాలు ఆయన సూచించారు. ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పన పెంచడం,థర్డ్ వేవ్‌ కట్టడికి వ్యాక్సిన్లు వేయడం పెంచడం, ప్రజల ఒకచోట గుంపుగా ఉండకుండా చూసుకోవడం ముఖ్యమని గులేరియా తెలిపారు. ఈ చర్యలు తీసుకుంటే కేసులు తగ్గేందుకు ఆస్కారం ఉందని ఆయన తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు