Rahul Gandhi : కంప్లీట్ వ్యాక్సినేషన్ కావాలి..బీజేపీ అబద్దాలు కాదు

భారతదేశానికి ఇప్పుడు వేగవంతమైన మరియు పూర్తిస్థాయి వ్యాక్సినేషన్ అవ‌స‌ర‌మ‌ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు.

India Needs Quick And Complete Vaccination Not Bjps Lies Rahul Gandhi

Rahul Gandhi భారతదేశానికి ఇప్పుడు వేగవంతమైన మరియు పూర్తిస్థాయి వ్యాక్సినేషన్ అవ‌స‌ర‌మ‌ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు. ఈ మేరకు బుధవారం రాహుల్ ఓ ట్వీట్ చేశారు. దేశానికి పూర్తిస్థాయి వ్యాక్సినేషన్ కావాలి కానీ భార‌తీయ జ‌న‌తాపార్టీ మార్కు అబ్బద్దాలు,అవాస్తవ ప్రచారాలు అవసరం లేదని ఆయ‌న ట్వీట్‌ చేశారు. క‌రోనా విష‌యంలో ప్రధాని నరేంద్ర మోదీ అనుసరిస్తున్న విధానాలవల్ల టీకాల కొరత ఏర్నడిందని రాహుల్‌గాంధీ ఆరోపించారు.

మోదీ ఫేక్ ఇమేజ్ ను కాపాడేందుకు కేంద్రప్రభుత్వం నిరంతరం చేస్తున్న ప్రయత్నాలన్నీ వైరస్‌ వ్యాప్తిని పెంచడానికి దోహదపడుతున్నాయని, తద్వారా అధిక సంఖ్యలో ప్రజలు కొవిడ్‌ మహమ్మారికి బలవుతున్నారని రాహుల్ తెలిపారు ఆస్ట్రాజెనికా కోవిడ్-19 వ్యాక్సిన్ రెండు డోసుల మధ్య సమయాన్ని ఎలాంటి శాస్త్రీయ ఒప్పందం లేకుండానే పెంచాలని ప్రభుత్వం సిఫారసు చేసినట్లు తెలుపుతున్న వార్తా కథనాన్ని రాహుల్ తన ట్విట్ట‌ర్‌లో ట్యాగ్ చేశారు.