×
Ad

India and New Zealand : భారత్, న్యూజిలాండ్ మధ్య బిజినెస్ డీల్.. 15ఏళ్లలో 20 బిలియన్ డాలర్ల పెట్టుబడులు

India and New Zealand : భారత్ - న్యూజిలాండ్ సంబంధాల్లో కీలక మైలురాయిగా నిలిచే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం విజయవంతంగా పూర్తయినట్లు

India and New Zealand

India and New Zealand : భారత్ – న్యూజిలాండ్ సంబంధాల్లో కీలక మైలురాయిగా నిలిచే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం విజయవంతంగా పూర్తయినట్లు ప్రధాని నరేంద్ర మోదీ, న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టఫర్ లక్సన్ సంయుక్తంగా ప్రకటించారు. సోమవారం ఇద్దరు ప్రధానులు ఫోన్లో మాట్లాడుకున్నారు. అనంతరం స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై ప్రకటన చేశారు. అయితే, ఈ ఒప్పందాలు వచ్చే ఏడాది నుంచి అమల్లోకి రావొచ్చని భారత వాణిజ్య కార్యదర్శి వెల్లడించారు.

Also Read : Cab Driver : క్యాబ్ డ్రైవర్ చేసిన పనికి కంగుతిన్న మహిళ.. రంగంలోకి పోలీసులు.. కొన్ని గంటల్లోనే అరెస్టు..

న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టఫర్ లక్సన్ ఈ ఏడాది మార్చి నెలలో భారత పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. ఆ సమయంలోనే ఇరు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు ప్రారంభమయ్యాయి. తాజాగా.. ఆర్థిక సంబంధాలు బలోపేతం చేసుకునే దిశగా, ఎగుమతిదారులకు మరింత మార్కెట్ అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఇరు దేశాల ప్రధానులు ఒప్పందాన్ని ఖరారు చేసుకున్నారు. దీనిపై మూడు నెలల్లో సంతకాలు చేసే అవకాశం ఉందని భారత వాణిజ్య కార్యదర్శి వెల్లడించారు.

భారత్ – న్యూజిలాండ్ దేశాల మధ్య భాగస్వామ్యం కొత్త శిఖరాలను చేరుకోబోతుంది. రాబోయే ఐదేళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయడానికి ఎఫ్‌టీఏ వేదికను సిద్ధం చేస్తుంది. విభిన్నం రంగాల్లో న్యూజిలాండ్ నుండి 20 బిలియన్ డాలర్లకుపైగా పెట్టుబడులను భారతదేశం స్వాగతిస్తుంది. మన దేశంలోని ప్రతిభావంతులైన యువత, శక్తివంతమైన స్టార్టప్ పర్యావరణ వ్యవస్థ, సంస్కరణ-ఆధారిత ఆర్థిక వ్యవస్థ ఆవిష్కరణ, వృద్ధి, దీర్ఘకాలిక భాగస్వామ్యానికి బలమైన పునాదిని అందిస్తాయి. అదే సమయంలో క్రీడలు, విద్య, సాంస్కృతిక సంబంధాల వంటి ఇతర రంగాలలో సహకారాన్ని బలోపేతం చేస్తూనే ఉన్నామని ప్రధాని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.

రెండు దేశాల మధ్య వాణిజ్యం వృద్ధి చెందుతోన్న తరుణంలో ఈ ఎఫ్‌టీఏ కుదిరింది. దీంతో న్యూజిలాండ్ కంపెనీలు తమ వస్తువులు, సేవలను భారత మార్కెట్‌లో విక్రయించుకోవడాన్ని సులభతరం చేయనుంది. రానున్న రెండు దశాబ్దాల్లో భారత్‌కు తమ ఎగుమతుల విలువ సంవత్సరానికి 1.1 బిలియన్ డాలర్ల నుంచి 1.3 బిలియన్ డాలర్ల చొప్పున పెరిగే అవకాశం ఉందని న్యూజిలాండ్ ప్రధాని లక్సన్ పేర్కొన్నారు. వాణిజ్యం పెరగడం అంటే మరిన్ని ఉద్యోగాలు, అధిక వేతనాలు, కష్టపడి పనిచేసే న్యూజిలాండ్ ప్రజలకు మరిన్ని అవకాశాలుఅని ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు.

భారత మార్కెట్లోకి పాల ఉత్పత్తులు, తాజా పండ్లు, వైన్ , ఉన్నిని ప్రధానంగా ఎగుమతి చేయాలని న్యూజిలాండ్ భావిస్తోంది. అయితే, న్యూజిలాండ్ నుంచి డిమాండ్ ఉన్నప్పటికీ పాల ఉత్పత్తులపై సుంకాలకు ఎలాంటి రాయితీ ఇవ్వలేదు. ఇదిలాఉంటే.. ఈ ఏడాదిలో ఇప్పటికే యూకే, ఒమన్‌తో వాణిజ్య ఒప్పందాలు కుదిరాయి. అమెరికా, ఐరోపాతో ఇంకా చర్చల దశలో ఉన్నాయి.