ISRO: 50 శాటిలైట్లను ప్రయోగిస్తాం: ఇస్రో ఛైర్మన్ ఎస్.సోమనాథ్

ISRO: ఇవేగాక జియో ఇంటెలిజెన్స్ కు సంబంధించి శాటిలైట్లపై కూడా ఇస్రో దృష్టి సారించింది.

ISRO chairman Somnath

భారతదేశ కీర్తి, ప్రతిష్ఠలను ప్రపంచం నలుమూలాలా వ్యాపింపజేస్తున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరిన్ని లక్ష్యాలను పెట్టుకుంది. 2023లో దేశానికి ఇస్రో ఎన్నో విజయాలను సాధించి పెట్టింది.

చంద్రయాన్-3, ఆదిత్య ఎల్1ను విజయవంతంగా ప్రయోగించడంతో పాటు మరిన్ని లక్ష్యాలకు 2023లో పునాదులు వేసుకుంది ఇస్రో. ఇవేగాక జియో ఇంటెలిజెన్స్ కు సంబంధించి శాటిలైట్లపై కూడా దృష్టి సారించింది. జియో ఇంటెలిజెన్స్ కోసం ఐదేళ్లలో 50 ఉపగ్రహాలను ప్రయోగించాలని ఇండియా లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఇస్రో ఛైర్మన్ ఎస్.సోమనాథ్ తెలిపారు.

పలు కక్ష్యల్లో శాటిలైట్ల లేయర్లను సృష్టించి వేలాది కిలోమీటర్ల దూరంలోని సైనికుల కదలికలను పసిగట్టే సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం వంటి లక్ష్యాలతో వీటిని ప్రయోగిస్తున్నట్లు ఎస్.సోమనాథ్ వివరించారు. శక్తిమంతమైన దేశంగా భారత్‌ను తీర్చిదిద్దే లక్ష్యానికి ప్రస్తుతం ఉన్న జియో ఇంటెలిజెన్స్ సరిపోదని గుర్తించినట్లు చెప్పారు.

ఇప్పుడు ఉన్నదానికంటే పది రెట్లు అధిక సామర్థ్యంతో పనిచేసే జియో ఇంటెలిజెన్స్ కావాలని ఎస్.సోమనాథ్ తెలిపారు. ఈ సామర్థ్యం మన దేశానికి ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. తాజాగా, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బాంబే నిర్వహించిన టెక్‌ఫెస్ట్‌లో పాల్గొన్న సోమనాథ్ ఈ విషయాలు తెలిపారు.

Petrol-Diesel Prices : లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పెట్రో ధరల తగ్గింపు? మోదీ సర్కారు యోచన

ట్రెండింగ్ వార్తలు