Air India 3rd Flight Carrying 250 Indians Included Telugu Students From Ukraine Reached Delhi Today
Ukraine: యుక్రెయిన్ బాధితులను భారత్‌కి తీసుకుని వచ్చే కార్యక్రమం ఆపరేషన్ గంగ కార్యక్రమం వేగవంతం అయ్యింది. కేంద్ర ప్రభుత్వం యుక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను తరలించేందుకు మరో 9 విమానాలను పంపుతోంది. ఈ విమానాలు మార్చి 4న హంగేరిలోని బుచారెస్ట్, బుడాఫెస్ట్, ర్జేసో విమానాశ్రయాలకు చేరుకోనున్నాయి.
ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెక్స్, ఇండిగోకు చెందిన ఈ 9 విమానాల్లో 18వందల మంది విద్యార్థులను తరలించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత ఉన్నతస్థాయి సమావేశం తరువాత భారత వాయుసేన రంగంలోకి దిగింది. రెండు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానాలు హంగేరి, రొమేనియా నుంచి భారతీయులను తీసుకుని భారత్‌కు చేరుకున్నాయి.
ఇప్పటివరకు 16 విమానాల్లో స్వదేశానికి చేరుకున్న సుమారు మూడు వేల మంది భారతీయులు వారి వారి ఇళ్లకు చేరుకున్నారు. మార్చి 4వ తేదీ నుంచి 31 విమానాల్లో విమానాల ద్వారా.. 6300 మందికిపైగా భారత పౌరులను స్వదేశానికి తీసుకురానున్నట్లు కేంద్రం చెబుతోంది.
‘ఆపరేషన్ గంగ’లో భాగంగా కేంద్రం ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు విమానాలను నడుపుతోంది కేంద్రం. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, ఇండిగో, స్పైస్‌జెట్‌తో పాటు భారత వాయుసేన విమానాలలో ప్రయాణికులను తరలిస్తున్నారు. 21 విమానాలు రొమేనియాలోని బుకారెస్ట్, 4 హంగేరీలోని బుడాపెస్ట్, మరో నాలుగు పోలాండ్లోని రెస్జో నుంచి, ఒకటి స్లొవేకియా నుంచి భారతీయులను తీసుకొచ్చేందుకు షెడ్యూల్ చేసినట్లు వెల్లడించాయి అధికారిక వర్గాలు.