India Covid Deaths : భారత్‌లో కరోనా మృత్యుఘోష..

భారత్‌పై కరోనా మృత్యు పంజా విసిరుతోంది. కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గుతున్నప్పటికి మరణాల సంఖ్య మాత్రం పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. 24గంటల్లో మరణాల సంఖ్య అమాంతం పెరిగిపోయింది.

India Covid Deaths 2021 : భారత్‌పై కరోనా మృత్యు పంజా విసిరుతోంది. దేశంలో తొలిసారి రికార్డు స్థాయిలో కరోనా మరణాలు నమోదయ్యాయి. కొత్తగా 3.48 లక్షల కరోనా కేసులు నమోదుకాగా.. 4,198 మరణాలు నమోదయ్యాయి. భారత్ లో 37 లక్షల కరోనా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి.

కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గుతున్నప్పటికి మరణాల సంఖ్య మాత్రం పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. 24గంటల్లో మరణాల సంఖ్య అమాంతం పెరిగిపోయింది. ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో 4వేల 205 కరోనా మరణాలు రికార్డయ్యాయి.

దేశంలోకి కరోనా ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఒక్కరోజులో కోవిడ్‌ కారణంగా ఇంత మంది చనిపోవడం ఇదే తొలిసారి. గత శుక్రవారం 4 వేల 187మంది కరోనాతో చనిపోగా.. ఇప్పుడా సంఖ్యను దాటి మరణాలు రికార్డయ్యాయి. గత 14రోజుల్లో దేశంలో కరోనాతో 50 వేల మంది చనిపోయారు. మరోవైపు రోజువారి కేసులతో పాటు యాక్టివ్ కేసులు సంఖ్య గతవారంతో పోలిస్తే కాస్త తగ్గుముఖం పట్టింది. దేశంలో ఒక్కరోజులో 3లక్షల 48వేల పాజటివ్ కేసులు రికార్డయ్యాయి.

అటు యాక్టివ్ కేసుల సంఖ్య కూడా వరుసగా మూడో రోజు తగ్గాయి. యాక్టివ్‌ కేసుల కంటే కరోనా నుంచి కోలుకున్న వారు ఎక్కువగా ఉండడం ఇది వరుసగా మూడో రోజు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో లక్షకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరో ఆరు రాష్ట్రాల్లో 50 వేల నుంచి 1లక్ష యాక్టివ్ కేసులు ఉన్నాయి. మిగతా 17 రాష్ట్రాల్లో 50వేల కన్నా తక్కువ యాక్టివ్ కేసులు ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు