Covid cases: దేశంలో కొత్తగా ఎన్ని కరోనా కేసులు?

కరోనాతో ఇప్పటివరకు మొత్తం 5,31,918 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.

Corona Virus

Covid cases – India: దేశంలో ఇప్పటికీ పలు రాష్ట్రాల్లో కరోనా (Corona virus) కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కొత్తగా 47 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ (Union Health Ministry) తెలిపింది. దీంతో ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,552గా ఉందని చెప్పింది.

కరోనాతో ఇప్పటివరకు మొత్తం 5,31,918 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. దేశంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 4.49 కోట్లు (4,49,95,980)గా ఉందని చెప్పింది.

కరోనా నుంచి కోలుకున్న కేసుల సంఖ్య 4,44,62,510గా ఉందని పేర్కొంది. నేషనల్ రికవరీ రేటు 98.81 శాతంగా ఉన్నట్లు తెలిపింది. దేశంలో ఇప్పటివరకు మొత్తం 220.67 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు వినియోగించినట్లు పేర్కొంది.

Zomato CEO : ఫ్రెండ్ షిప్ డే రోజు డెలివరీ బాయ్‌గా మారిన జొమేటో సీఈవో