India COVID-19 Cases : 24 గంటల్లో భారత్‌లో 1.86 లక్షల కొత్త కరోనా కేసులు.. 44రోజుల్లో ఇదే అత్యల్పం

భారతదేశంలో కరోనావైరస్ కేసుల్లో తగ్గుదల కనిపిస్తోంది. సింగిల్ డే కరోనా కేసుల సంఖ్య మే నెలలో వరుసగా రెండోసారి 2 లక్షల మార్కుకు పడిపోయింది.

India COVID-19 Cases : భారతదేశంలో కరోనావైరస్ కేసుల్లో తగ్గుదల కనిపిస్తోంది. సింగిల్ డే కరోనా కేసుల సంఖ్య మే నెలలో వరుసగా రెండోసారి 2 లక్షల మార్కుకు పడిపోయింది. అయితే రికవరీలు వరుసగా 15వ రోజు రోజువారీ కేసులను మించిపోతున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు వెల్లడించాయి.

ఒక రోజులో మొత్తం 1,86,364 కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. ఇది 44 రోజులలో అతి తక్కువగా నమోదైంది. కరోనా కేసుల మొత్తం సంఖ్య 2,75,55,457కు చేరింది. రోజువారీ మరణాల సంఖ్య 3,660తో మొత్తం మరణాల సంఖ్య 3,18,895కు చేరుకుంది.

భారత్‌లో రోజువారీ కరోనా గణనాలు చివరిగా మే 25న 2 లక్షల మార్కుకు పడిపోయింది. దేశంలో COVID-19 మొత్తం ర్యాపిడ్ పరీక్షలు గురువారం 20,70,508 జరిగాయి. దాంతో దేశంలో ఇప్పటివరకూ 90,39,861 కరోనా కేసులు నమోదయ్యాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 9 శాతానికి తగ్గింది. వరుసగా నాలుగు రోజులుగా 10 శాతం కంటే తక్కువగా నమోదైంది. వారపు పాజిటివిటీ రేటు మరింత 10.42 శాతానికి తగ్గిందని మంత్రిత్వ శాఖ తెలిపింది. రికవరీలు వరుసగా 15వ రోజు రోజువారీ కొత్త కేసులను మించిపోతున్నాయి.

24 గంటల్లో యాక్టివ్ కాసేలోడ్‌లో 76,755 కేసుల నికర క్షీణతతో మొత్తం కేసుల్లో 8.50 శాతంతో యాక్టివ్ కేసులు 23,43,152కు తగ్గాయి. జాతీయ కోవిడ్ -19 రికవరీ రేటు 90.34 శాతానికి పెరిగింది. కోలుకున్న వారి సంఖ్య 2,48,93,410కు పెరిగింది. కరోనా మరణాల రేటు 1.16 శాతానికి పెరిగిందని డేటా పేర్కొంది. భారత్‌కు చెందిన కొవిడ్-19 కేసుల సంఖ్య ఆగస్టు 7న 20 లక్షలు, ఆగస్టు 23న 30 లక్షలు, సెప్టెంబర్ 5న 40 లక్షలు, సెప్టెంబర్ 16న 50 లక్షలు దాటింది.

సెప్టెంబర్ 28న 60 లక్షలు, అక్టోబర్ 11న 70 లక్షలు, అక్టోబర్ 29న 80 లక్షలు, నవంబర్ 20న 90 లక్షలు దాటి డిసెంబర్ 19న ఒక కోటి మార్కును అధిగమించింది. మే 4న ఇండియాలో 2 కోట్ల మైలు రాయిని కరోనా కేసులు చేరుకున్నాయి. 3,660 కొత్త మరణాలలో మహారాష్ట్ర నుంచి 884, కర్ణాటక నుండి 476, తమిళనాడు నుండి 474, ఉత్తర ప్రదేశ్ నుండి 187, కేరళ నుండి 181, పంజాబ్ నుండి 177, పశ్చిమ బెంగాల్ నుండి 148, ఢిల్లీ నుండి 117, ఆంధ్రప్రదేశ్ నుంచి 104 నమోదయ్యాయి.

దేశంలో ఇప్పటివరకు 3,18,895 మరణాలు నమోదయ్యాయి. మహారాష్ట్ర నుంచి 92,225, కర్ణాటక నుంచి 27,405, ఢిల్లీ నుంచి 23,812, తమిళనాడు నుంచి 22,289, ఉత్తర ప్రదేశ్ నుంచి 19,899, పశ్చిమ బెంగాల్ నుంచి 14,975, పంజాబ్ నుంచి 14,004 మరణాలు నమోదు కాగా మొత్తంగా 70 శాతం మరణాలు కొమొర్బిడిటీల వల్ల సంభవించాయని మంత్రిత్వ శాఖ గణాంకాల్లో వెల్లడించింది.

ట్రెండింగ్ వార్తలు